Gas Leak: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో (Atchutapuram SEZ) మరోసారి విష వాయువు లీకైంది. సీడ్స్ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీ (Poison gas leak) కారణంగా దాదాపు 100 మంది మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వికారంతో స్పృహ తప్పి పడిపోయారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే కొందరికి ప్రథమచికిత్స (First Aid) అందించారు. మరి కొందరిని ఫ్యాక్టరీ బస్సులు, కార్లు, అంబులెన్సుల్లో అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. పెద్ద సంఖ్యలో మహిళలు వాంతులు, వికారంతో ఆర్తనాదాలు చేశారు. బి షిఫ్ట్‌లో ఫ్యాక్టరీలో దాదాపు 4వేల మంది కార్మికులు పని చేస్తుండగా వారిలో దాదాపు 100 అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఏడాది జూన్‌లో కూడా ఇదే ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకై పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. సీడ్స్ దుస్తుల కంపెనీ, సమీపంలోని పోరస్ లాబ్స్‌ను దాదాపు వారం రోజుల పాటు మూసివేసి ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరిపింది. హైదరాబాద్‌లోని ఐఐసీటీ సహా ఇతర అధికారులతో రసాయన వాయువు లీకేజీపై నివేదికలు తీసుకున్న ప్రభుత్వం వాటిని ఇప్పటివరకు బహిర్గతం చేయకపోవడం గమనార్హం.
స్పందించిన మంత్రి: అచ్యుతాపురం ఘటనపై మంత్రి అమర్‌నాథ్ స్పందించారు. బాధితులకు వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వాయువు లీకేజీపై కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఇవీ చూడండి