Lawyers protest against CID notices :హైకోర్టు న్యాయవాదులకు రాష్ట్ర సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వడానికి నిరసిస్తూ.. అనకాపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒకరోజు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. భావ వ్యక్తీకరణ తెలిపిన న్యాయవాదులకు 160 సీఆర్పీసీ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. న్యాయవాదులు తమ క్లైంట్లు సంబంధించి భావవ్యక్తీకరణ మాట్లాడొచ్చని... అలాగే మార్గదర్శిపై హైకోర్టు న్యాయవాదులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారన్నారు. దీనికి సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని న్యాయవాదులు తప్పుపట్టారు. రాష్ట్రంలో కొంతమంది పోలీసులు చట్టంపై అవగాహన లేకుండా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్బంగా మాట్లాడిన న్యావాదులు తన క్లైంట్లు పట్ల మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని.. తెలిపారు. తమ స్వేచ్ఛను హరించేలా పోలీసులు వ్యవహరించడం తగదన్నారు. భావ వ్యక్తీకరణ తెలిపిన హైకోర్టు న్యాయవాదులకే పోలీసులు నోటీసులు ఇచ్చారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పోలీసులకి న్యాయవాదులకు మధ్య స్నేహ సంబంధం ఉండాలని హితవు పలికారు. అయితే, కొంతమంది పోలీసులు దీన్ని కాలరాసెలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా కోర్టు: ఏపీ సీఐడీ పోలీసులు విజయవాడలో న్యాయవాదులకు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ చిత్తూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు మాట్లాడారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో ఏపీ సీఐడీ పోలీసుల పనితీరుపై న్యాయవాదులు తమ గళం విప్పారని చెప్పారు. సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధమని అన్నారు. న్యాయవాదుల స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోలీసు వాక్ స్వాతంత్రపు హక్కును సైతం కాలరాస్తున్నారని విమర్శించారు.
'మార్గదర్శిపై మాట్లాడిన న్యాయావాదులకు నోటీసులు ఇవ్వడంపై రాష్ట్రావ్యాప్తంగా న్యాయవాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందుకు సంబంధించిన నేడు అనకాపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఇదే అంశంపై సీఐడీకి వ్యతిరేకంగా న్యాయవాదులందరం నిరసన తెలియజేస్తున్నాం'-. రాజశేఖర్, అనకాపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు
'సీనియర్ లాయర్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చే ముందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి తెలపాలి. వారి నుంచి అనుమతి తీసుకోవాలి. నోటీసులు ఇవ్వడానికి కారణాలు తెలపాలి. 160 సీఆర్పీసీ నోటీసులు ఎలా ఇస్తారో సీఐడీ తెలపాలి. గత కొంత కాలంగా తమ అభిప్రాయాలు తెలిపిన న్యాయవాదులకు నోటీసులు ఇస్తున్నారు. జడ శ్రావన్ గారికి సైతం గతంలో నోటీసులు ఇచ్చారు. ఎవరి అనుమతితో నోటీసులు ఇచ్చారు. ఎలా ఇచ్చారు అనే అంశాలపై సీఐడీ వివరణ ఇవ్వాలి.'- రామారావు, న్యాయవాది
'న్యాయవాదులు మర్గదర్శి చిట్స్‌ను గురించి పత్రికలకు తమ అభిప్రాయాన్ని తెలిపారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా అదుపుతప్పింది. న్యాయవాదులు మాట్లాడితే వారికి నోటీసులు ఇచ్చారు. అసలు ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం న్యాయవాదులకు ఎలాంటి హక్కులు ఉంటాయో పోలీసులు తెలుసుకోవాలి.'- ఇంద్రగంటి కొండలరావు , న్యాయవాది
ఇవీ చదవండి: