Accident: అనకాపల్లి జిల్లాలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఘటనల్లో ఆరుగురు మరణించగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నర్సీపట్నంలోని అప్పన్నదొరపాలెం కూడలి వద్ద కారు బోల్తాపడి ముగ్గురు మరణించారు. మాకవరపాలెం మండలానికి చెందిన వీరు.. రాత్రి తూర్పు గోదావరి జిల్లా తునిలో వివాహానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో అతి వేగంగా వచ్చి చెట్టును బలంగా ఢీ కొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులంతా మాకవరపాలెం మండలం తామరం గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ , నాగేంద్ర , రోహిత్ లుగా గుర్తించారు.
మరో ఘటనలో.. నక్కపల్లి మండలం ఒడిమెట్ట వద్ద ఆగిఉన్న లారీని.. మినీ వ్యాను ఢీకొట్టడంతో ఇద్దరు ఇద్దరు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మూడో ఘటనలో నక్కపల్లి వద్ద ఆగిఉన్న వ్యాన్ను బైక్ ఢీకొనటంతో ఒకరు మరణించారు.
సత్య సాయి జిల్లాలో : తలుపుల మండలం పొలతల వాండ్లపల్లి వద్ద 15 మంది కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. గొడ్డు వెలగలకు చెందిన వ్యవసాయ కూలీలు తలుపుల మండలంలో వ్యవసాయ పనులకు బయలుదేరారు. ఆటో పొలతల వాండ్లపల్లి వద్దకు రాగానే.. అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మహిళా కూలీ మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలిని గాండ్లపెంట మండలం గొడ్డు వెలగల గ్రామానికి చెందిన కృష్ణమ్మగా గుర్తించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: