దిల్లీ పర్యటన ముగించుకుని రాత్రి తన నివాసానికి చేరుకున్న సీఎం అభ్యర్థుల వ్యవహారంపై కసరత్తు చేసి కొలిక్కి తెచ్చారు. మార్చి 29తో ఎమ్మెల్యే కోటాలోని 5 స్థానాల కాలపరిమితి ముగుస్తుంది. వీరిలో మంత్రి యనమల రామకృష్ణుడు, పి. నారాయణ, పి.శమంతకమణి, అంగూరి లక్ష్మీ శివకుమారి, ఆదిరెడ్డి అప్పారావులు ఉన్నారు. తెదెపాకు దక్కే 4 స్థానాల్లో యనమల, విశాఖ జిల్లా బీసీ రజక సామాజిక వర్గానికి చెందిన దువ్వారుపు రామారావు, కాపు సామాజిక వర్గం నుంచి ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్బాబు, కర్నూలు జిల్లా బోయ సామాజిక వర్గం నుంచి బీటీ నాయుడులను ఖరారు చేశారు.
గవర్నర్ కోటాలో అనంతపురం ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి శమంతకమణికి అవకాశం ఇచ్చారు.
సోమిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం శమంతకమణికి కేటాయించారు. గవర్నర్ కోటాలో మరో స్థానం శివనాథ్ రెడ్డికి అవకాశం కల్పించారు. రామసుబ్బారెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ముందస్తు ఒప్పొందంలో భాగంగా శివనాథ్ రెడ్డికి కేటాయించారు. ఎంవీవీఎస్ మూర్తి మరణంతో ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల కోటా స్థానాన్ని బుద్దా నాగ జగదీశ్వరరావుకు ఖరారు చేశారు.