ETV Bharat / state

ప్రభుత్వ తీర్మానంపై ఆందోళనలు.. మన్యంలో కొనసాగుతున్న బంద్‌

author img

By

Published : Mar 31, 2023, 8:05 AM IST

Updated : Mar 31, 2023, 2:29 PM IST

MANYAM BANDH : బోయ వాల్మీకులు, బొంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ.. ప్రభుత్వం చేసిన తీర్మానంపై ఆదివాసీ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన సంఘాల నేతలు ఈరోజు ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చారు.

MANYAM BANDH
MANYAM BANDH
ప్రభుత్వ తీర్మానంపై ఆందోళనలు.. మన్యంలో కొనసాగుతున్న బంద్‌

TRIBAL LEADERS CALLED FOR MANYAM BANDH : బోయ వాల్మీకులు, బొంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ.. ఇటీవలే జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్మానంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు సైతం ఈ తీర్మానాన్ని ఖండిస్తున్నారు. తాజాగా ఆదివాసీ ప్రాంతాల్లో సైతం ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన సంఘ నేతలు నేడు ఏజెన్సీ బంద్​కు పిలుపునిచ్చారు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాలో తెల్లవారుజాము నుంచే ఆందోళనకారులు రహదారుల పైకి వచ్చి నిరసనలు తెలిపారు.

తమ రాజ్యాంగ హక్కును కాలరాయొద్దని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంద్​ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ తీర్మానాన్ని ప్రభుత్వం ఆమోదించిన క్రమంలో.. గిరిజన ప్రాంత ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తక్షణమే రాజీనామా చేయాలి లేకుంటే గిరిజన ద్రోహులుగా మిగిలిపోతారంటూ ఆదివాసీ నాయకులు హెచ్చరించారు.

"BC -A కేటగిరిలో ఉన్న బోయ, వాల్మీకి, బొంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఆదివాసిల మనుగడకు ప్రమాదకరం. ఈ నెల 24న శాసనసభలో ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి. లేనిపక్షంలో ప్రభుత్వం దిగొచ్చి.. తీర్మానాన్ని వెనక్కి తీసుకునేవరకు పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం"-అర్జున్ రావు, గిరిజన సంఘం నేత

అల్లూరిలో కొనసాగుతోన్న బంద్​: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో బంద్​ ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడకక్కడి రహదారులు అష్ట దిగ్బంధనం చేశారు. పాడేరు నలువైపులా ఎటువంటి వాహనాలు ప్రవేశించకుండా నిలువరించారు. నడిం వీధిలో రోడ్డుపై వంటవార్పు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేయడంతో ఇంటర్ విద్యార్థినిలు పరీక్ష కేంద్రాలకు నడిచి వెళ్లారు. పాడేరు, తలార్సింగి, చింతల వీధి, గుత్తులు పుట్టు ప్రధాన రహదారిపై కర్రలు, చెట్ల కొమ్మలు, రాళ్లు అడ్డంగా పేర్చి గిరిజనులు తమ నిరసన తెలిపారు.

కత్తి, డాలుతో నిరసనలు: బోయ, వాల్మీకులను ఎస్టీలో చేర్చడాన్ని నిరసిస్తూ మన్యం బంద్​ అరకు లోయలో ప్రశాంతంగా సాగుతోంది. అన్ని గిరిజన సంఘాలు, అఖిలపక్షాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. గిరిజన ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఆకులతో దుస్తులుగా కట్టుకొని గిరిజన వేటకు ఉపయోగించే కత్తి, డాలు వంటి ఆయుధాలను ధరించి గిరిజనులు బందులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ గిరిజనులకు అన్యాయం చేసే విధంగా బోయ, వాల్మీకులను ఎస్టీలో చేర్చారని మండిపడ్డారు. ఇప్పటికైనా అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

జగన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు: బొంతు ఒరియా, బోయ, వాల్మికులను ఎస్టీల్లో చేర్చడాన్ని నిరసిస్తూ మన్యం బంద్​.. చింతపల్లి గూడెం, కొత్త వీధి, కొయ్యూరు మండలాల్లో విజయవంతమైంది. ముందు నుంచే విస్తృతంగా గిరిజన జేఏసీ నాయకులు ప్రచారం నిర్వహించడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి జేఏసీ నాయకులు, అఖిలపక్ష నాయకులు రహదారులపై చేరి వాహనాల రాకపోకలని నియంత్రించారు. చింతపల్లిగూడెం, కొత్త వీధి, సీలేరు, దారకొండలలో రహదారులపై గిరిజన సంఘ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్.. జగన్ డౌన్ డౌన్​ అంటూ నినాదాలతో మన్యం హోరెత్తి పోయింది.

రంపచోడవరంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబు రమేష్, ఆదివాసీ జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కూడలిని నిర్బంధం చేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఉండడంతో మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఆదివాసీ నాయకులు కార్యాలయం గేటు వద్ద బైఠాయించారు. కానీ లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలో గిరిజన సంఘాల పిలుపు మేరకు శుక్రవారం బంద్ నిర్వహించారు. సీతంపేట మండల కేంద్రంలో ఉదయం నుంచి రాకపోకలు అడ్డుకున్నారు. ఏజెన్సీలో దుకాణాలు మూసివేశారు. ఎస్టీ జాబితాలో ఇతర కులాలను చేరుస్తూ ప్రభుత్వం చేసిన తీర్మానం రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. తక్షణమే ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

గిరిజన ఆదివాసి జేఏసీ సంఘం ఆధ్వర్యంలో సాలూరు మండలం దత్తివలస గ్రామం ప్రధాన రహదారి వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చితే ఊరుకోమని హెచ్చరించారు. గిరిజన షెడ్యూల్ గ్రామాలలో 170 యాక్ట్ అమలు కావడం లేదని.. దీంతో గిరిజనులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఏలూరులో ఆందోళనలు: బోయ, వాల్మీకులు, బొంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తామన్న తీర్మానంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లాలో మన్యం బంద్‌కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. బుట్టాయగూడెంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. రోడ్డుకు అడ్డంగా కంచెలు వేసి రహదారులు దిగ్బంధం చేసి ఆందోళనలు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 31, 2023, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.