HERO SAI DHARAM TEJ : విద్యార్థులే భావితరాలకు స్ఫూర్తి దాతలు కావాలని ప్రముఖ నటుడు సాయిధరమ్ తేజ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జూనియర్ కళాశాలలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో మాదక పదార్థాలను నిలువరించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొద్దిసేపు జూనియర్ కళాశాల విద్యార్థులతో మమేకమయ్యారు.గంజాయి వంటి డ్రగ్స్ జోలికి పోకుండా చదువు పైనే దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు.
కనిపెంచిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించాలన్నారు. గిరిజన ప్రాంతంలో ఉంటూ ఉన్నత చదువులు అభ్యసించాలని ఆయన ఆకాంక్షించారు. మన్యంలో గంజాయి వంటి మత్తు పదార్థాలను నిలువరించేందుకు వీలుగా పోలీస్‌శాఖ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి వారికి కృతజ్ఞతలు తెలపాలన్నారు.
"యువతీ, యువకులు ఇద్దరికి అభినందనలు. చదువుకుంటూనే డ్రగ్స్ వాడకాన్ని నివారిస్తున్నందుకు మీరు సూపర్. చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టండి. పోలీసులకు సహకరించండి. అలాగే తల్లిదండ్రులు,టీచర్స్‌ను మరచిపోవద్దు"-సాయి ధరమ్ తేజ్, హీరో
అంతకుముందు పోలీసు శాఖ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతంలో చేపడుతున్న కార్యక్రమాలతో పాటు గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా యువతను చైతన్య పరుస్తున్న అంశాలపై స్థానిక సీఐ దేవుడుబాబు.. సాయి ధరమ్‌తేజ్‌కు వివరించారు. గంజాయి జోలికి ఎవరు వెళ్లకూడదని.. "గంజాయి వద్దు.. ఆరోగ్యం ముద్దు" వంటి స్లోగన్స్‌తో విద్యార్థుల్లో చైతన్యం రగిలించారు.
ఇవీ చదవండి: