Construction of Hydro Power Project: అల్లూరి జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని.. టీడీపీ డిమాండ్ చేసింది. గిరిజనులకు హాని కలిగే ఈ ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం వెనెక్కి తీసుకోవాలని.. గిరిజనులతో కలసి తెలుగుదేశం ఆద్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతగిరి మండలం పెదకోట, పెనుకోట పంచాయితీల పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సేకరిస్తున్న భూముల వల్ల గిరిజనులను అన్యాయం జరుగుతుందంటూ వారు నినాదాలు చేశారు. టీడీపీ మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ ఆద్వర్యంలో రేగుపాలెం, కొండిబకోట, టమాటో గ్రామాల గిరిజన ప్రజానీకం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రాజెక్టు వ్యతిరేకంగా.. ఈటెలు, కత్తులు, గొడ్డలితో వినూత్న నిరసనలు తెలిపారు.. జగన్ ప్రభుత్వం గిరిజనుల చట్టాలను తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. గిరిజనుల భూముల జోలికొస్తే సహించేదే లేదని.. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వానికి హెచ్చరించారు.. .
ఇవీ చదవండి: