School girl died సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొనేందుకు నృత్య సాధన చేస్తూ ఓ విద్యార్థిని కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన చింతపల్లి మండలంలో చోటుచేసుకుంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చింతపల్లి ఠాణాపై దాడి చేసి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా చింతపల్లిలో ఈనెల 22న ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇచ్చేందుకు తాజంగి కస్తూర్బా విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న పొటుకూరి గీతామాధురి తోటి విద్యార్థినులతో శుక్రవారం రాత్రి సాధన చేస్తుండగా కుప్పకూలింది. వెంటనే ఆమెను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి చింతపల్లి సీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు మహేశ్వరరావు తెలిపారు. గీతామాధురికి రెండు వారాల క్రితం పచ్చ కామెర్లు రావడంతో ఇంటికి వెళ్లి, గురువారమే తిరిగి వచ్చిందని కస్తూర్బా ప్రత్యేకాధికారిణి పార్వతమ్మ తెలిపారు
ఇవీ చదవండి:
Pawan Kalyan కడపలో నేడు పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర