ETV Bharat / state

కరెంటు పెట్టిన కఠిన పరీక్ష.. కొవ్వొత్తుల వెలుగులో విద్యార్థుల చదువు - కరెంటు పెట్టిన కఠిన పరీక్ష

వీధి దీపాల వెలుతురులో చదివామంటూ పూర్వీకులు చెప్పేవారు.! ఆధునిక కాలంలో.. అలాంటి పరిస్థితి కనిపించేది తక్కువే. కానీ పదో తరగతి పరీక్షల వేళ.. ఆ విద్యార్థుల దుస్థితి చూస్తే మళ్లీ పాత రోజులకు వెళ్తున్నామా అనే అనుమానం కలగక మానదు. జీవితంలో ఎంతో కీలకమైన తరుణంలో.. కరెంట్ కోతలతో ఆ పిల్లలు ఎదురీదుతున్నారు. ఒక్కో కొవ్వొత్తి చుట్టూ చాలీచాలని వెలుతురులో సుమారు 10 మంది కూర్చుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. జి.మాడుగుల ఆసుపత్రిలో ఓ గర్భిణికి సెల్‌ఫోన్‌ వెలుగులో వైద్యులు ప్రసవం చేశారు.

students struggled with power cuts
students struggled with power cuts
author img

By

Published : May 4, 2022, 5:29 AM IST

Updated : May 4, 2022, 9:01 AM IST

కరెంటు పెట్టిన కఠిన పరీక్ష

Power Cuts Effect on Tenth Students: పదో తరగతి విద్యార్థులు చీకట్లో చదువులు కొనసాగించాల్సిన దుస్థితి అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలో నెలకొంది. జి.మాడుగులలోని 33/11కె.వి. సబ్‌స్టేషన్లో కీలకమైన పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ శనివారం రాత్రి కాలిపోయింది. మండలం మొత్తానికి విద్యుత్తు సరఫరాకు అవసరమైన ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడంతో 17 పంచాయతీలు, 435 తండాలు అంధకారంలో చిక్కుకున్నాయి. చింతపల్లి సబ్‌స్టేషన్‌ నుంచి రోజూ కొన్ని గ్రామాలకు 3 గంటలలోపు మాత్రమే విద్యుత్తు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పదో తరగతి విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందిపడుతున్నారు.

మండలంలోని 12 పాఠశాలలకు చెందిన 552 మంది పదో తరగతి విద్యార్థులు జి.మాడుగులలోని గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాల వసతిగృహాల్లో ఉండి పరీక్షలు రాస్తున్నారు. వీరంతా కొవ్వొత్తులు, టార్చిలైట్ల వెలుగులో చదువుతున్నారు. రాత్రి 2 గంటలే విద్యుత్తు ఉంటోంది. అదీనూ లోవోల్టేజీతో ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. విద్యార్థులు చదువుకుంటున్న వసతిగృహాలను ‘న్యూస్‌టుడే’, ‘ఈటీవీ’ బృందం మంగళవారం రాత్రి పరిశీలించగా వారు కొవ్వొత్తుల వెలుగులో చదువుతూ కనిపించారు. విద్యుత్తు లేక జి.మాడుగుల ఆసుపత్రిలో మంగళవారం రాత్రి 9 గంటలకు ఓ గర్భిణికి సెల్‌ఫోన్‌ వెలుగులో వైద్యులు ప్రసవం చేశారు. వరుసగా విద్యుత్తు లేక సెల్‌ఫోన్లకు సిగ్నల్స్‌ పంపే టవర్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో బ్యాటరీలూ ఛార్జింగ్‌ అయ్యే పరిస్థితి లేదు.

ఇదీ చదవండి: పెనుగాలుల విధ్వంసం.. ప్రమాదపు అంచుల్లోకి దక్షిణ విద్యుత్​ గ్రిడ్​

Last Updated : May 4, 2022, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.