అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంత ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నేటి నుంచి మూడు రోజులు జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.. ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చెప్పారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అమ్మవారి జాతరను పురస్కరించుకొని గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆలయ అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం కోటి రూపాయలు నిధులు మంజూరు చేసింది. తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సమర్పించనున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఉత్సవాలకు దూరమైన గిరిజనులు.. ఈసారి భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. సుమారు వెయ్యి మంది పోలీసు బలగాలతో ప్రత్యేక పర్యవేక్షణ చేయనున్నారు. పాడేరులో ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పులిచింతలలో గేటు కొట్టుకుపోయి 9 నెలలైనా.. పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం