ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 4న భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను ప్రధానమంత్రికి పరిచయం చేసి సత్కరించే కార్యక్రమాన్ని క్షత్రియ పరిషత్ చేపట్టింది.
ఈ మేరకు క్షత్రియ పరిషత్ నర్సీపట్నం సభ్యులు డీవీఎస్ రాజు అల్లూరి జిల్లా నడుంపాలెం లంకవీధి జీడితోటల్లో ఉంటున్న గంటం దొర మనువడు బోడి దొర కుటుంబ సభ్యులను కలిసి ఆహ్వానించారు. ఏ ప్రభుత్వం వీరిని ఆదుకోలేదని..,ఇప్పటికి వీరు పూరి గుడిసెల్లో జీవనం సాగిస్తున్నారని డీవీఎస్ రాజు అన్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా తమ వంతుగా సాయం చేసేందుకు వీరిని ప్రధాని వద్దకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి