ETV Bharat / state

ఓ వైపు కొనుగోలు ప్రకంపనలు.. మరోవైపు జోరుగా ప్రచారం.. మునుగోడులో ఎవ్వరూ తగ్గేదే లే - ఏపీ తాజా వార్తలు

Munugode bypoll Campaign: తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఓవైపు ప్రకంపనలు కొనసాగుతుండగానే.. మరోవైపు మునుగోడులో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి వెళ్తున్న ప్రధాన పార్టీల నేతలు తమ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అధికార తెరాస అభివృద్ధిని ప్రస్తావిస్తుండగా.. విపక్ష నేతలు సర్కార్‌ వైఫల్యాలను ఎండగడుతున్నారు.

ఉప ఎన్నిక
bypoll
author img

By

Published : Oct 27, 2022, 10:46 PM IST

మునుగోడులో ఎవ్వరూ తగ్గేదే లే

Munugode bypoll Campaign: తెలంగాణ రాష్ట్రం మునుగోడు ఉపఎన్నికకు ప్రధాన పార్టీలు కార్యక్షేత్రంలో ప్రజలతో మమేకమవుతున్నారు. తెరాస అభ్యర్థికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు చురుగ్గా కదులుతున్నారు. నాంపల్లి మండలం లక్ష్మణాపురం ముంపు గ్రామాల్లో ప్రాజెక్టు భూనిర్వాసితులతో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ముచ్చటించారు. భూమి కోల్పోయిన బాధితులను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత కేసీఆర్‌ సర్కార్‌ తీసుకుంటుందని వారికి హామీ ఇచ్చారు.

చౌటుప్పల్ మండలం జై కేసారంలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ఓటు అమ్ముకోవద్దంటూ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. మునుగోడు నియోజవర్గానికి సంబంధించి తెరాస సర్కారుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఎనిమిదేళ్లలో మునుగోడును అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. మునుగోడు గోడు పట్టని కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆక్షేపించారు.

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అరాచకాలను బండి చార్జ్‌షీట్ రూపంలో విడుదల చేశారు. భాజపాపై దుష్ప్రచారం చేస్తున్న తెరాసను వదలిపెట్టబోమని బండి సంజయ్ స్పష్టంచేశారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం జాన్ తండాలో ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్, ఏనుగు రవీందర్ రెడ్డి, రితేష్ రాథోడ్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు.

తండాలకు రోడ్లు, తాగునీరు, పక్కా ఇళ్లు లేవని ఆరోపించిన ఈటల కేంద్రం సహకారంతో పూర్తిచేస్తామని భరోసా ఇచ్చారు. మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని బతికించేలా తెలంగాణ జన సమితి అభ్యర్థిని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షుడు కోడందరాం చౌటుప్పల్‌లో ప్రచారం నిర్వహించారు. ఓటు అమ్ముకోవద్దంటూ నాంపల్లిలో స్వచంద సంస్థ అవగాహన కల్పించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.