PREGNANT WOMEN DELIVERED IN BATHROOM: మనం చేసే చిన్న తప్పు మరొకరికి శాపంగా మారుతుంది. తన పేగు తెంచుకుని జన్మించిన శిశువును ఆసుపత్రి బాత్రూంలో వదిలేసిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాడేరు ఆసుపత్రిలో పెళ్లికాని ఓ యువతి ప్రసవించి శిశువుని వదిలిపెట్టి వెళ్లింది. జిల్లా ఆసుపత్రికి గుర్తు తెలియని యువతి బ్యాక్ పెయిన్ అంటూ జనరల్ చెకప్‌కు వచ్చింది. డాక్టర్ యూరిన్ పరీక్షించాలని చెప్పగా.. టాయిలెట్‌కు వెళ్లి ఆడ శిశువుకు జన్మనించింది. ఆ తరువాత చిన్నారిని అక్కడై వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఉదయం బాత్రూంకి వెళ్లినవారు చూసి సిబ్బందికి విషయం తెలిపారు.
తలకు చిన్నపాటి గాయమైన శిశువును మాతాశిశు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. శిశువు ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెప్పారు. యువతి ఇచ్చిన సమాచారమంతా తప్పుల తడకగా ఉన్నట్లు గుర్తించారు. ఆమె విద్యార్థి అని.. ఆమెతోపాటు ఒకరిద్దరు బంధువులు వచ్చినట్లు చెబుతున్నారు.
ఇవీ చదవండి