ETV Bharat / state

వేసవి డిమాండ్​ను తట్టుకునేందుకు ప్రైవేటులో విద్యుత్ కొనుగోళ్లు.. జెన్కో డైరక్టర్ - news on APGENCO Director

APGENCO Director MV Satyannarayan: ప్రస్తుతం రాష్ట్రంలో 240 నుంచి 290 మిలియన్ యూనిట్ల విద్యుత్తు డిమాండ్ ఉందని, ఏపీ జెన్కో సంచాలకుడు ఎం వీ. సత్యన్నారాయణ తెలిపారు. వేసవిలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు ప్రైవేటు సెక్టార్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే.. పోలవరం వద్ద 12 యూనిట్లుతో విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, మొదటి యూనిట్ 2024 అందుబాటులోకి వస్తుందని సత్యన్నారాయణ తెలిపారు.

APGENCO Director MV Satyannarayan
ఏపీ జెన్కో
author img

By

Published : Mar 12, 2023, 4:07 PM IST

APGENCO Director MV Satyannarayan: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండు అనుగుణంగా విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి చేస్తున్నామని ఏపీ జెన్కో డైర‌క్ట‌ర్‌ ఎంవీ స‌త్య‌న్నారాయ‌ణ అన్నారు. సీలేరులో ఏపీ జెన్కో అతిథి గృహంలో స్థానిక విలేక‌రులతో ఆయన సమావేశం నిర్వహించారు. వేసవి రావడంతో రోజురోజుకు డిమాండ్ పెరుగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 240 నుంచి 290 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉందని సత్యన్నారాయణ తెలిపారు. ఉన్న వ‌న‌రులు వినియోగించుకుని విద్యుత్ కేంద్రాలో డిమాండుకు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు ప్రైవేటు సెక్టార్ నుంచి విద్యుత్​ కొనుగోలు చేస్తున్నామని సత్యన్నారాయణ తెలిపారు.

ఏపీ లో జెన్కో పరిధిలో కొత్త ప్రాజెక్టులపై దృష్టిసారించినట్లు ఎం వీ. సత్యన్నారాయణ పేర్కొన్నారు. అందులో భాగంగా ధర్మల్ జలవిద్యుకేంద్రాల్లో కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం'(నెల్లూరు) లో 800 మెగావాట్లు సామర్థ్యం గల యూనిట్​లో వాణిజ్య కార్యకలాపాల ప్రకటన (సీవోడీ) జరిగిందని తెలిపారు. విజయవాడలోని డాక్టర్ నార్ల తాతారావు ధర్మల్ విద్యుత్ కేంద్రంలో 1780 మెగావాట్లు అందబాటులోకి వచ్చిందని తెలిపారు. మరో 800 మెగావాట్లు యూనిట్ విద్యుత్ వినియోగంలోకి తీసుకువచ్చామన్నారు. మరో రెండు నెలల్లో వాణిజ్య కార్యకలాపాల ప్రకటన విడుదలయ్యే అవకాశముందని సత్యన్నారాయణ వెల్లడించారు.

సీలేరు కాంప్లెక్స్‌లో పొల్లూరులో 150 మెగావాట్లు సామర్థ్యం గల రెండు యూనిట్లుతో రెండో దశ నిర్మాణం ప్రతిపాదించామని తెలిపారు. ఇందుకు సంబందించిన అనుమతులు వచ్చాయని సత్యన్నారాయణ వెల్లడించారు. పోలవరంపై 12 యూనిట్లుతో విద్యుత్ కేంద్రాన్ని జెన్కో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబందించి మెగా ఇంజినీరింగ్ కంపెనీ పనులు చేపట్టిందని, వేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. అందులో మొదటి యూనిట్ 2024 అందుబాటులోకి వస్తుందని, జలవిద్యుత్ కేంద్రము 2026 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని సత్యన్నారాయణ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల జెన్కో ఖాతాలో 960 మెగావాట్లు ఉత్పత్తి చేరుతుందని, అదేవిధంగా పొల్లూరు ప్రాజెక్టుతో 300 మెగావాట్లు, సీలేరు సంప్డ్ స్టోరేజీ వల్ల జెనోకు 1350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అదనంగా వస్తాయని సంచాలకుడు సత్యన్నారాయణ అన్నారు.

గోదావరి డెల్టాలో వరి పైరు వికసించే దశలో ఉండటంతో పోలాలకు నీరు సరిపోకపోవడంతో.. సీలేరు మీద ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. ఇదే అంశంపై ఉన్నత స్థాయిలో చర్చలు జరిపి నీటిని విడుదల చేస్తున్నామని వెల్లడించారు. మార్చి వరకూ 7300 క్యూసెక్కులు విడుదల చేశామని తెలిపారు. మళ్లీ మార్చి 10 నుంచి 2300 క్యూసెక్కుల చొప్పున గోదావరి డెల్లాకు నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు, ఈ నెలాఖరువరకూ నీటి విడుదల కొనసాగుతుందని వెల్లడించారు. వేసవిలో పరిస్థితులకు అనుగుణంగా నీరు విడుద‌ల చేసే అంశంపై చర్యలు తీసుకుంటామని సంచాలకుడు తెలిపారు.

సీలేరులో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు వ‌ల్ల స్థానికుల‌కు ఎటువంటి ఇబ్బంది ఉండ‌బోద‌ని ఏపీ జెన్‌కో డైర‌క్ట‌ర్‌ ఎంవీ స‌త్య‌న్నారాయ‌ణ అన్నారు. పంప్డ్ స్టోరేజి ప్రాజెక్ట్ నిర్మాణం వ‌ల్ల సీలేరులో ఇళ్లు, దుకాణాలు కోల్పోతాయ‌ని వ‌స్తున్న అపోహ‌లు నేప‌థ్యంలో సీలేరు వ‌చ్చిన డైర‌క్ట‌ర్‌ను స్థానికులు క‌లిసారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న ఈ ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు వ‌ల్ల సీలేరుకు ఎటువంటి ఇబ్బంది ఉండ‌ద‌ని, ఈ ప్రాజెక్టు అండ‌ర్ గ్రౌండ్ ప్రాజెక్టు అని దీని వ‌ల్ల ఎటువంటి కాలుష్యం ఉండ‌ద‌ని స‌త్య‌న్నారాయ‌ణ పేర్కొన్నారు.
ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.