టెన్నిస్‌కు పునఃప్రారంభంగా భావించిన పలెర్మో మహిళల ఓపెన్ టైటిల్‌ను ఫియోనా ఫెర్రో (ఫ్రాన్స్) సొంతం చేసుకుంది. ఆమె ఫైనల్లో నాలుగో సీడ్ అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా)కు షాక్ ఇచ్చింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 53వ స్థానంలో ఉన్న ఫెర్రో 6-2, 7-5 తేడాతో అనెట్‌ను ఓడించింది. ఈ టోర్నీలో తుదిపోరుకు చేరే క్రమంలో 23 ఏళ్ల ఫెర్రో కేవలం ఒక్క సెట్ మాత్రమే కోల్పోవడం విశేషం. ఆమెకిది రెండో డబ్ల్యూటీఏ టైటిల్. దాదాపు ఐదు నెలల విరామం తర్వాత నిర్వహించిన తొలి అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీ ఇదే.
-
Fiona Ferro is the first champion after the break 🇫🇷
— Palermo Ladies Open (@LadiesOpenPA) August 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
🏆 The frenchwoman wins the #PLO20. It's the second @WTA title in her career.
Ferro b. Kontaveit 6-2 7-5 pic.twitter.com/aD1vsr0jr0
">Fiona Ferro is the first champion after the break 🇫🇷
— Palermo Ladies Open (@LadiesOpenPA) August 9, 2020
🏆 The frenchwoman wins the #PLO20. It's the second @WTA title in her career.
Ferro b. Kontaveit 6-2 7-5 pic.twitter.com/aD1vsr0jr0Fiona Ferro is the first champion after the break 🇫🇷
— Palermo Ladies Open (@LadiesOpenPA) August 9, 2020
🏆 The frenchwoman wins the #PLO20. It's the second @WTA title in her career.
Ferro b. Kontaveit 6-2 7-5 pic.twitter.com/aD1vsr0jr0
జాగ్రత్తలు పాటిస్తూనే..
ఈ టోర్నీని( పురుషులు, మహిళల విభాగాలు) అన్ని జాగ్రత్తలు తీసుకుని పకడ్బంధీగా ముగించారు. బాల్కిడ్స్ను తగ్గించడం, పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించడం, మ్యాచ్ ముగిసిన తర్వాత క్రీడాకారులు చేతులు కలపకుండా నిరోధించడం లాంటి చర్యలు తీసుకున్నారు. క్రీడాకారిణులతో పాటు టోర్నీ ప్రతినిధులకు ప్రతి నాలుగు రోజులకోసారి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. పాజిటివ్‌గా తేలిన ఓ క్రీడాకారిణి టోర్నీ నుంచి వైదొలిగింది.