ఫుట్‌బాల్ గేమ్‌లో రిఫరీలు రెడ్, ఎల్లో కార్డ్‌లు జారీ చేయడం సాధారణంగానే చూస్తుంటాం. గ్రౌండ్‌లో ప్లేయర్స్ గొడవకు దిగినా, అసభ్య పదజాలాన్ని ఉపయోగించినా రెడ్‌కార్డ్ జారీ చేస్తారు. దీంతో ఆటగాళ్లు మ్యాచ్ ముగిసేవరకు మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఇక వార్నింగ్ ఇచ్చి వదిలేయడానికి ఎల్లో కార్డ్‌ను వినియోగిస్తారు. అయితే ఈ రెండు కార్డులు కాకుండా మరో కార్డు ఉంటుంది. అదే వైట్ కార్డ్. ఫుట్‌బాల్ చరిత్రలో ఈ కార్డులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వైట్‌కార్డ్ చూపించింది లేదు. అయితే తాజాగా మహిళల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో మాత్రం రిఫరీ వైట్‌కార్డ్ చూపించడం విశేషం. తొలిసారి ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది
ఎక్కడ జరిగిందంటే.. రీసెంట్గా పోర్చుగల్‌లో మహిళల ఫుట్‌బాల్‌లో బెన్‌ఫికా, స్పోర్టింగ్ లిస్బన్ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో మరి కాసేపట్లో తొలి హాఫ్ ముగుస్తుందన్న సమయంలో స్టాండ్స్‌లో ఓ ప్రేక్షకుడు అకస్మాతుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఇది గమనించిన రిఫరీ వైట్‌కార్డ్ చూపించాడు. క్రీడలో వైట్‌కార్డ్‌ను క్రీడాస్ఫూర్తికి చిహ్నంగా పరిగణిస్తారు. రిఫరీ వైట్‌కార్డ్ చూపించగానే అక్కడి వైద్య సిబ్బంది సదరు ప్రేక్షకుడికి చికిత్స అందించారు. జరగుతున్నది ఫ్రెండ్లీ మ్యాచ్ కనుక క్రీడాస్ఫూర్తి చూపించాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్లు రిఫరీ మ్యాచ్ అనంతరం తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అతడిని ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-
CARTÃO BRANCO NO DÉRBI! ⬜👏
— Canal 11 (@Canal_11Oficial) January 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
As equipas médicas do Benfica e do Sporting receberam cartão branco por assistirem um adepto que se sentiu mal na bancada.#Canal11 #FutebolEmPortuguês pic.twitter.com/zTfvwiZFO0
">CARTÃO BRANCO NO DÉRBI! ⬜👏
— Canal 11 (@Canal_11Oficial) January 21, 2023
As equipas médicas do Benfica e do Sporting receberam cartão branco por assistirem um adepto que se sentiu mal na bancada.#Canal11 #FutebolEmPortuguês pic.twitter.com/zTfvwiZFO0CARTÃO BRANCO NO DÉRBI! ⬜👏
— Canal 11 (@Canal_11Oficial) January 21, 2023
As equipas médicas do Benfica e do Sporting receberam cartão branco por assistirem um adepto que se sentiu mal na bancada.#Canal11 #FutebolEmPortuguês pic.twitter.com/zTfvwiZFO0
ఇదీ చూడండి: క్రీడా రంగంలోకి విజయ్ దేవరకొండ ఎంట్రీ.. ఆ జట్టుకు సహ యజమానిగా