Dandi Jyotika wins Gold: తెలుగమ్మాయి దండి జ్యోతిక శ్రీ(ఆంధ్రప్రదేశ్) 400 మీటర్ల వ్యక్తిగత పరుగు విభాగంలో అద్భుతాలు సృష్టిస్తోంది. కాగా, ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 18 పతకాలతో సత్తా చాటిన ఆమె.. తాజాగా అంతర్జాతీయ స్ప్రింట్, రిలే కప్ అథ్లెటిక్స్ పోటీల్లోనూ మెరిసింది. టర్కీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో స్వర్ణ పతకంతో సత్తాచాటింది. మహిళల 400 మీటర్ల పరుగును ఆమె 53.47 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచింది.
గతేడాది జాతీయ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 400 మీటర్ల పరుగును 53.05 సెకన్లలో ముగించి స్వర్ణంతో మెరిసింది. అలానే అదే ఏడాది ఫెడరేషన్ కప్ (53.57 సె), జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ (53.79 సె), అంతర్రాష్ట్ర టోర్నీ (53.29 సె) మెరుగైన ప్రదర్శనతో ముగించింది.
ఇదీ చూడండి: రఫా రఫ్ఫాడించాడు.. మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సొంతం