ETV Bharat / sports

గిల్‌ ఔట్​తో మళ్లీ తెరపైకి 'సాఫ్ట్‌ సిగ్నల్‌'.. అంటే ఏంటి? - డబ్లూటీసీ ఫైనల్​ 2023 శుభమన్ గిల్ క్యాచౌట్​

WTC final 2023 shubman gill cameron green catch : ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్​లో టీమ్​ఇండియా బ్యాటర్‌ శుభమన్‌ గిల్‌ ఔటు వివాదస్పదమైంది. బంతి నేలను తాకినట్లు కనిపించినా.. థర్డ్ అంపైర్‌ ఔటు ఇవ్వడం వల్ల అభిమానులు మండిపడుతున్నారు. సాఫ్టసిగ్నల్‌ ఉంటే ఇలా జరిగేది కాదని అంటున్నారు. ఆ వివరాలు..

wtc final 2023 shubman gill cameron green catch
గిల్‌ ఔట్​తో మళ్లీ తెరపైకి 'సాఫ్ట్‌ సిగ్నల్‌'.. అంటే ఏంటి?
author img

By

Published : Jun 11, 2023, 12:27 PM IST

WTC final 2023 shubman gill cameron green catch : సాఫ్ట్​ సిగ్నల్‌ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ మ్యాచ్​లో.. టీమ్​ఇండియా​ రెండో ఇన్నింగ్స్​లో ఫస్ట్ వికెట్​గా శుభమన్​ గిల్​ వెనుదిరిగిన సంగతి తెలిసిందే. బోలాండ్ వేసిన బంతిని గిల్ బాదగా.. దాన్ని గల్లీలో ఉన్న గ్రీన్ నేలకు సమీపంలో​ క్యాచ్ పట్టాడు. అయితే దీన్ని పట్టిన తీరు వివాదస్పదమైంది. గ్రీన్ పట్టుకున్న క్యాచ్​.. ఫీల్డ్​ అంపైర్లు థర్డ్​ అంపైర్​కు రిఫర్ చేశారు. టీవీ రీప్లేలో బంతి నేలను తాకినట్లు కనిపించినా.. థర్డ్​ అంపైర్​ మాత్రం గిల్​ను ఔట్​గా ప్రకటించారు. దీంతో గిల్​ నిరాశగా వెనుదిరగగా.. అభిమానులు కూడా థర్డ్​ అంపైర్​ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. సాఫ్ట్ సిగ్నల్​ నిబంధన అమల్లో ఉంటే గిల్​ కచ్చితంగా నాటౌట్​ అయ్యేవాడని నెటిజన్లు, ఫ్యాన్స్​ అనడం ప్రారంభించారు.

ఈ రూల్​ తొలిగింపు.. అయితే ఈ సాఫ్ట్‌ సిగ్నల్‌ రూల్​ను ఈ నెల నుంచే ఐసీసీ తొలగించింది. ఈ మేరకు ఐసీసీ నియమించిన ఓ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో టీమ్​ఇండియా మాజీ బ్యాటర్‌ గంగూలీ కూడా ఓ సభ్యుడు. ఈ రూల్​ అనవసరమైన గందరగోళ పరిస్థితులు సృష్టిస్తోందని దాదా అన్నారు.

ఏమిటీ సాఫ్ట్‌ సిగ్నల్‌?.. మైదానంలో బాల్​ను ప్లేయర్స్​ సరిగ్గా క్యాచ్​ పట్టుకున్నారా? లేదా అది నేలకు తాకిందా? అనే అనుమానం కలిగినప్పుడు.. మైదానంలోని అంపైర్లు ఔట్‌ లేదా నాటౌట్‌ను 'సాఫ్ట్‌ సిగ్నల్‌'గా చూపిస్తారు. టీవీ అంపైర్​ను తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతారు. రీప్లేలో పరిశీలించిన తర్వాత కూడా క్లారిటీ రాలేదంటే.. మైదానంలోని అంపైర్‌ తీసుకున్న 'సాఫ్ట్‌ సిగ్నల్‌'ను సమర్థిస్తూ టీవీ అంపైర్‌ నిర్ణయం తీసుకుంటారు. నాటౌట్ అయినప్పటికీ.. స్టేడియంలో అంపైర్‌ 'సాఫ్ట్‌ సిగ్నల్‌' చూపిస్తూ ఔట్‌ ఇవ్వడం.. దాన్ని టీవీ అంపైర్‌ సమర్థించడం చాలా సార్లు వివాదంగా మారింది. అందుకే ఈ రూల్​ను తొలిగించి.. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయానికి పెద్దపీట వేశారు.

కామెరూన్ గ్రీన్ రియాక్షన్​.. కామెరూన్ గ్రీన్‌ క్యాచ్​ను ఉద్దేశించి స్టేడియంలోని ప్రేక్షకులు.. 'ఛీటర్​, ఛీటర్​... మోసం.. మోసం" అంటూ మైదానం దద్దరిల్లేలా అరిచారు. దీనిపై కామెరూన్ స్పందించాడు. "అప్పుడు నేను సరిగ్గానే క్యాచ్‌ పట్టినట్లు భావించాను. క్లియర్‌ క్యాచ్‌నే అందుకుని పైకి విసిరా. ఇందులో నాకెలాంటి సందేహనం, అనుమానం అస్సలు కలగలేదు. అయితే.. ఇక్కడ నిర్ణయం థర్డ్‌ అంపైర్‌కు వెళ్లింది. అతడు ఈ క్యాచ్​ను సరైనదిగా అంగీకరిస్తూ తన నిర్ణయం ప్రకటించాడు. స్లిప్స్‌లో క్యాచ్‌లను పట్టేందుకు నేను చాలా కష్టపడ్డాను. ఎప్పుటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉన్నాను" అని గ్రీన్‌ పేర్కొన్నాడు.

వైరల్​గా గిల్ ట్వీట్​.. శుభమన్​ గిల్ కూడా దీనిపై సెటైరికల్‌గా ఓ ట్వీట్ చేశాడు. థర్డ్ అంపైర్‌కు కళ్లు సరిగ్గా కనిపించలేదా? అనే అర్థం వచ్చేలా.. గ్రీన్‌ క్యాచ్‌ అందుకుంటున్న ఫొటోను పోస్ట్​ చేశాడు. దానికి భూతద్దం ఎమోజీలను జోడించాడు. ఈ ట్వీట్ అయితే క్షణాల్లో సోషల్​మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదీ చూడండి :

WTC Final 2023 : అంపైర్ తప్పుడు నిర్ణయానికి శుభ్‌మన్ గిల్ బలి!.. ఫ్యాన్స్​ ఫుల్​ ఫైర్​!!

WTC Final 2023 : నాలుగో రోజు ఆట పూర్తి.. భారత్​ మరో 280 పరుగులు చేస్తేనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.