ETV Bharat / sports

T20 worldcup: సెమీస్‌ రేసు నుంచి అఫ్గాన్‌ ఔట్‌.. లంక విజయం

author img

By

Published : Nov 1, 2022, 3:08 PM IST

టీ20 ప్రపంచకప్‌ సూపర్ -12 దశ నుంచి అప్ఘానిస్థాన్​ దాదాపుగా వైదొలిగింది. తాజాగా జరిగిన మ్యాచ్​లో లంకపై 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

T20 worldcup Srilanka won the match
సెమీస్‌ రేసు నుంచి అఫ్గాన్‌ ఔట్‌.. లంక విజయం

టీ20 ప్రపంచకప్‌ సూపర్ -12 దశ నుంచి అప్ఘానిస్థాన్​ దాదాపు వైదొలిగినట్లే. గత ఆసియా కప్‌లో శ్రీలంకను ఓడించిన అఫ్గానిస్థాన్‌ మరోసారి సంచలనం సృష్టిస్తుందేమోనని అంతా భావించారు. కానీ శ్రీలంక అన్ని విభాగాల్లో రాణించి తాజా మ్యాచ్​లో అఫ్గాన్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీస్‌ అవకాశాలను లంక (4 పాయింట్లు) సజీవంగా ఉంచుకొంది. నవంబర్ 5న ఇంగ్లాండ్‌తో చివరి మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌ (2 పాయింట్లు) చివరి స్థానంలో ఉంది. తన ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో (నవంబర్ 4న) తలపడనుంది.

బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ గుర్బాజ్ (28) టాప్‌ స్కోరర్‌ కాగా.. ఉస్మాన్ ఘని 27, ఇబ్రహీం జద్రాన్ 22, నజీబుల్లా 18, గుల్బాదిన్ 12, నబీ 13, రషీద్ ఖాన్ 9 పరుగులు చేశారు. లంక బౌలర్లలో వహిందు హసరంగ 3, లాహిరు కుమార 2.. రజిత, డిసిల్వా చెరో వికెట్‌ తీశారు.

అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 148 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ పాతున్ నిస్సాంక (10) త్వరగానే పెవిలియన్‌కు చేరినా.. కుశాల్ మెండిస్ (25), చరిత్ అసలంక (19), భానుక రాజపక్స (18) సాయంతో ధనంజయ డిసిల్వా (66*) శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు. డిసిల్వా అర్ధశతకం సాధించాడు. అప్ఘాన్​ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ (2/31), ముజీబ్ ఉర్ రహ్మాన్ (2/24) వికెట్లు తీశారు.

ఇదీ చూడండి: T20 worldcup: అదే కనుక జరిగితే టీమ్​ఇండియాకు బిగ్​ టెన్షనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.