టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లతో పాటు 5000 పరుగులు చేసిన భారతీయ రెండో ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మ్యాచ్‌లో భాగంగా బుధవారం ఇందోర్‌లో ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో జడ్డూ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఆరు బంతుల్లో తొమ్మిది పరుగుల వద్ద ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను ఎల్బీడబ్యూగా ఔట్ చేసి ఈ రికార్డును అందుకున్నాడు. నమోదైంది.
ఇకపోతే ఇప్పటివరకు 298 అంతర్జాతీయ మ్యాచుల్లో 241 ఇన్నింగ్స్ ఆడిన జడ్డూ 33.29 సగటుతో 5527 పరుగులు చేశాడు. ఇందులో మూడ శతకాలతో పాటు 31 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ క్రికెట్‌లో జడేజా అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 175*. ఇక బౌలింగ్ విషయానికొస్తే 298 మ్యాచుల్లో 503 వికెట్లు పడగొట్టాడు. ఇందులో జడేజా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 7/42గా ఉంది.
అయితే ఇంతకుముందు ఈ రికార్డును నెలకొల్పింది భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్. తాజాగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌తో జడేజా.. కపిల్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. 356 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 382 ఇన్నింగ్స్‌లలో ఆడిన కపిల్ దేవ్ 27.53 సగటుతో 9031 పరుగులు చేశాడు. ఇక కపిల్ తన కెరీర్‌లో 9 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ బౌలింగ్‌లో 687 వికెట్లు తీశాడు కపిల్ దేవ్. ఇతడి బౌలింగ్ అత్యుత్తమ గణాంకాలు 9/83గా ఉంది.
ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్‌లో వీరిద్దరితో పాటు 5000 పరుగుల కంటే ఎక్కువ, అలాగే 500 వికెట్లు సాధించిన ఆల్‌రౌండర్ల జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, షాహిద్ అఫ్రిదీలు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ జట్టు నుంచి షకీబ్ అల్ హసన్, న్యూజిలాండ్ నుంచి డేనియల్ వెట్టోరీ, ఇంగ్లాండ్ టీమ్ ఆటగాడు ఇయాన్ బోథమ్, దక్షిణాఫ్రికా ప్లేయర్లు షాన్ పొలాక్, జాక్వెస్ కలిస్లతో పాటు శ్రీలంకకు చెందిన చమిందా వాస్‌లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు.
విరాట్‌తో సమంగా ఉమేశ్.. ఇక టీమ్‌ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా ఓ ఘనతను సాధించాడు. తన ఖాతాలో ఓ రికార్డును వేసుకొన్నాడు. ఏకంగా స్టార్ బ్యాటర్ కోహ్లీని సమం చేసి.. మాజీ కోచ్ రవిశాస్త్రి రికార్డును అధిగమించాడు. మూడో టెస్టు తొలి రోజు ఆటలో ఉమేశ్ రెండు సిక్స్‌లు బాదాడు. దీంతో తన టెస్ట్ కెరీర్‌లో 24 సిక్స్‌లు బాది.. అత్యధిక సిక్స్‌లు కొట్టిన 17వ బ్యాటర్‌గా అవతరించాడు. విరాట్(24), రవిశాస్త్రి 22 సిక్స్‌లు కొట్టగా.. భారత్ తరఫున అత్యధికంగా వీరేంద్ర సెహ్వాగ్ 91 సిక్స్‌లు బాదాడు. ఆ తర్వాత ధోనీ (78), సచిన్ (69), రోహిత్ (68), కపిల్ దేవ్ (61) టాప్ 5లో కొనసాగుతున్నారు.