ETV Bharat / sports

ODI World Cup 2023 : కాన్వే, రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీలు... ఇంగ్లాండ్‌పై కివీస్​ ఘన విజయం

ODI World Cup 2023 Newzealand vs England : వన్డే ప్రపంచకప్‌ (ODI WC 2023) ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్​ను చిత్తు చేసి ఓడించింది న్యూజిలాండ్. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 9:03 PM IST

Updated : Oct 5, 2023, 9:46 PM IST

ODI World Cup 2023 :  కాన్వే, రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీలు... ఇంగ్లాండ్‌పై కివీస్​ ఘన విజయం
ODI World Cup 2023 : కాన్వే, రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీలు... ఇంగ్లాండ్‌పై కివీస్​ ఘన విజయం

ODI World Cup 2023 Newzealand vs England : వన్డే ప్రపంచకప్‌ (ODI WC 2023) ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్​ బోణీ కొట్టింది. ఇంగ్లాండ్​పై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్.. ఈ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని పరాజయంతో ప్రారంభించింది. 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్​.. వికెట్ కోల్పోయి 36.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్‌ ప్లేయర్​ భారత సంతతి కుర్రాడు రచిన్ రవీంద్ర, కాన్వే విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇద్దరు చెరో సెంచరీలతో అదరగొట్టారు.

ఓపెనర్ విల్ యంగ్ గోల్డెన్ డకౌట్ అవ్వగా... కాన్వే, రచిన్ రవీంద్ర అజేయ సెంచరీలతో రెండో వికెట్‌కు 273 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. కాన్వే 121 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో సాయంతో 152 పరుగులు చేశాడు. డివాన్ కాన్వేకు ఇది నాలుగో వన్డే శతకం.

ఇక మొదటి సారి టాప్ ఆర్డర్​లో బ్యాటింగ్‌కు దిగిన రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచ కప్ హిస్టరీలో ఛేదనలో నమోదైన అత్యధిక భాగస్వామ్యం కూడా ఇదే. గతంలో 2011 వన్డే ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌పైనే లంక బ్యాటర్లు తిలకరత్నే దిల్షాన్ - ఉపుల్ తరంగ 231 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్​కు దిగిన న్యూజిలాండ్‌.. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. ఇక్కడ కూడా న్యూజిలాండ్ బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. ట్రెంట్ బౌల్ట్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టగా.. మ్యాట్ హెన్రీ మూడు వికెట్లు తీశాడు. మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ రెండేసి వికెట్లు తీశారు. ఇంగ్లాండ్​ బ్యాటర్లలో జో రూట్​(77) అర్ధ శతకంతో టాప్ స్కోరర్​గా నిలిచాడు. ఆ తర్వాత జానీ బెయిర్ స్టో(33), జాస్ బట్లర్​(43), హ్యారీ బ్రూక్​(25) రాణించారు. మిగతా వారు నామమాత్రపు స్కోర్లు చేశారు.

ODI World Cup 2023 : న్యూజిలాండ్ జట్టులో రప్ఫాడిస్తున్న మనోడు.. ఎవరీ​ 23 ఏళ్ల రచిన్ రవీంద్ర?.. అనంతపురంతో లింక్!

Indian Origin Cricketers In World Cup 2023 : వాళ్లూ మనోళ్లే.. ప్రత్యర్థి జట్ల తరఫున ఆడే భారత ప్లేయర్స్​ వీరే

Last Updated : Oct 5, 2023, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.