ETV Bharat / sports

'క్రికెట్‌ ప్రపంచమా.. ఆ పేరు గుర్తుపెట్టుకో'.. సచిన్‌ ట్వీట్‌ వైరల్ - నమీబియా క్రికెట్​ టీం న్యూస్​

టీ20 ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకకు షాకిస్తూ చిన్న జట్టు నమీబియా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌ నమీబియాను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం అది వైరల్​గా మారింది.

nam-yaad-rakhna-world-reacts-as-namibia-upset-sri-lanka-in-t20-world-cup-opener
వైరల్‌గా మారిన సచిన్‌ ట్వీట్‌
author img

By

Published : Oct 16, 2022, 10:41 PM IST

టీ20 ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లోనే సంచలనం నమోదైంది. క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఆసియా కప్‌ విజేత శ్రీలంకకు షాకిస్తూ చిన్న జట్టు నమీబియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటుతో చెలరేగిన నమీబియా.. ఆపై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో శ్రీలంకకు పీడకలను మిగిల్చింది. అద్వితీయ విజయం సాధించిన నమీబియా జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 'పేరు గుర్తుపెట్టుకోండి' అంటూ నమీబియా ప్రపంచ క్రికెట్‌కు సందేశం పంపింది అంటూ భారత క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఇప్పటికే దాదాపు 55వేలకు పైగా లైక్​లను ఆ ట్వీట్​ సొంతం చేసుకుంది. సచిన్‌తోపాటు పలువురు భారత మాజీలు సైతం ఆ జట్టును కొనియాడుతూ పోస్టులు చేశారు. వసీమ్‌ జాఫర్‌ తనదైన శైలిలో ఓ వీడియో స్పూఫ్‌తో నవ్వులు పూయించాడు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్లు ఫ్రైలింక్‌ (44), స్మిత్ (31*) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో కేవలం 108 పరుగులకే కుప్పకూలి 55 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. నమీబియా బౌలర్లలో డేవిడ్ వైస్‌, బెర్నాడ్, బెన్ షికోంగో, జాన్‌ ఫ్రైలింక్‌ రెండేసి వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.