బ్యాటింగ్‌లో ప్రయోగాలు చేయొద్దని యువ బ్యాట్స్‌మన్ పృథ్వీ షాను హెచ్చరించాడు కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్. టీమ్ఇండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్‌ను స్పూర్తిగా తీసుకోవాలని సూచించాడు.
"పృథ్వీ షా అనవసరమైన షాట్స్‌ను అస్సలు ప్రయత్నించవద్దు. వీలైనంత వరకు వాటిని దూరం చేయ్. వీరేందర్ సెహ్వాగ్‌ను స్పూర్తిగా తీసుకో, ఎలాంటి షాట్లు కొట్టగలవో వాటినే ప్రయత్నించు. అతడిలా(సెహ్వాగ్) ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండు"
-సంజయ్ మంజ్రేకర్, కామెంటేటర్
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో పృథ్వీ షా అదరగొట్టినా.. తర్వాత తర్వాత పేలవమైన ప్రదర్శనతో విఫలమైపోయాడు. దీంతో అతడిని పక్కన పెట్టి అజింక్య రహానెకు దిల్లీ జట్టులో స్థానం కల్పించారు. అతడు కూడా సరిగ్గా ఆడకపోవడం వల్ల మళ్లీ షాకు స్థానం కల్పించారు. కానీ అప్పుడు కూడా ఆకట్టుకోలేకపోయాడు.
ఇదీ చూడండి బీసీసీఐకి కిట్ స్పాన్సర్ దొరికేసింది