India's Batting Coach Vikram on Rahane: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్లు అజింక్య రహానే, ఛెతేశ్వర్ పూజారా పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీనిపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వీరు మెరుగైన బ్యాటింగ్ చేయలేదని ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా దీనిపై స్పందించాడు టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్(Vikram on Pujara).
"రహానే, పుజారా ప్రస్తుతం రాణించలేకపోతున్నారు. కానీ, గతంలో వారు చాలా మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వాళ్లు తిరిగి పుంజుకుంటారని ఆశిస్తున్నా," అని భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు నాలుగో రోజు ఆట అనంతరం మీడియా సమావేశంలో చెప్పాడు రాథోడ్.
రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha News) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీమ్‌కు అండగా నిలబడి అర్ధసెంచరీ చేశాడు. సాహా ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురిపించాడు రాథోడ్. మెడనొప్పి సమస్య ఉన్నప్పటికీ సాహా ఈ తరహాలో ఆడటం హర్షించాల్సిన విషయమని చెప్పుకొచ్చాడు.
విఫలమైన రహానే, పుజారా..
తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 26 పరుగులు చేయగా రహానే 35 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ ఇరువురు బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. పుజారా 22 పరుగులకే పెవిలియన్ చేరగా రహానే 4 పరుగులకే వికెట్ కోల్పోయాడు.
ఒక్క సెంచరీ లేక..
2021లో పుజారా, రహానే ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. రహానే ఈ ఏడాది 21 ఇన్నింగ్స్ ఆడగా 411 పరుగులు చేశాడు. ఈ ఏడాది పుజారా 639 పరుగులు చేశాడు.
IND vs NZ 1st test: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యే సమయానికి.. 284 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి నాలుగు పరుగులు చేసింది. క్రీజులో టామ్ లాథమ్(2*), విలియమ్ సోమర్విల్లే(0) ఉన్నారు.
తొలుత బ్యాటింగ్‌లో రాణించిన టీమ్‌ఇండియా.. ఆఖర్లో కివీస్ వికెట్ తీసి నాలుగో రోజు ఆటలో పూర్తి ఆధిపత్యం కనబరిచింది. న్యూజిలాండ్ గెలవాలంటే ఒక్క రోజు (90 ఓవర్లు)లో 280 పరుగులు చేయాల్సి ఉంది. భారత్‌కు విజయం దక్కాలంటే తొమ్మిది వికెట్లు పడగొట్టాలి. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేయగా..రెండో ఇన్నింగ్స్‌లో 234/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు 296/10. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగుల ఆధిక్యంతో కలిపి మొత్తం టీమ్‌ఇండియా లీడ్ 283 పరుగులకు చేరింది.
ఇదీ చదవండి: