ETV Bharat / sports

అది అయ్యర్​ అంటే భలే సమాధానమిచ్చాడుగా! - శ్రేయస్​ అయ్యర్​ షార్ట్ పిచ్ బాల్స్​

తనపై వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చాడు టీమ్​ఇండియా బ్యాటర్​ శ్రేయస్​ అయ్యర్​. ఏం చెప్పాడంటే..

shreyas iyer
అది అయ్యర్​ అంటే భలే సమాధానమిచ్చాడుగా!
author img

By

Published : Dec 24, 2022, 10:31 AM IST

భారత యువ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ షార్ట్ పిచ్​ బంతులు ఎదుర్కోలేడనే విషయం తెలిసిందే. దీనిపై ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే తాజాగా దీనిపై అతడు మాట్లాడాడు. ఆ విమర్శలను పట్టించుకోకుండా తప్పులు దిద్దుకోవడంపైనే దృష్టి పెట్టి విజయవంతం అయ్యానని అన్నాడు.

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసిన నేపథ్యంలో అతడిలా పేర్కొన్నాడు. "షార్ట్‌ పిచ్‌ బంతులను ఎదుర్కోవడంలో నా తడబాటును గుర్తించి బౌలర్లు అదే ఆయుధంతో లక్ష్యంగా చేసుకునేవాళ్లు. బయట మాటలను పట్టించుకోలేదు. షార్ట్‌ బంతులను వదిలేసినా లేదా బంతిని కిందకి అణిచి ఆడినా ఇబ్బంది ఉండదని అర్థం అయింది. బంగ్లాదేశ్‌పై ఇలాగే ఆడా. స్వీప్‌ షాట్‌ను కూడా సమర్థంగా ఉపయోగించుకున్నా. అదే షాట్‌కు ఔటైనందుకు బాధగా లేదు. ఆ బంతిని సరిగా ఆడలేకపోయా అంతే. కానీ సెంచరీ అందుకోలేకపోవడం నిరాశ కలిగించింది" అని శ్రేయస్‌ చెప్పాడు.

ఇదీ చూడండి: కరన్‌కు ఎందుకంత భారీ మొత్తం..? పంజాబ్‌ సహ యజమాని సమాధానమిదే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.