భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న నాలుగో టెస్టుకు జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. పేసర్ మార్క్ వుడ్, ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్‌కు టీమ్‌లో చోటు కల్పించింది. అయితే.. జాస్ బట్లర్ మాత్రం జట్టుకు దూరం కానున్నాడు. అతడి భార్య లూయిస్.. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడతడు.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో వుడ్ కుడి భుజానికి గాయమైంది. ఈ కారణంగా మూడో టెస్టుకు దూరమైన వుడ్.. మళ్లీ జట్టులో చేరాడు. బట్లర్ స్థానాన్ని బెయిర్ స్టో భర్తీ చేయనుండగా, సామ్ బిల్లింగ్స్ వికెట్ కీపర్‌గా ఆడనున్నాడు.
సెప్టెంబరు 2నుంచి ఇరు జట్లు ఓవల్ వేదికగా నాలుగో టెస్టులో తలపడనున్నాయి. మొత్తం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటి వరకు ఇరు జట్లు 1-1తో సమం చేశాయి.
ఇంగ్లాండ్ స్క్వాడ్:
జో రూట్ (కెప్టెన్), మోయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్, రోరీ బర్న్స్, సామ్ కరణ్, హసీబ్ బమీద్, డాన్ లారెన్స్, డేవిడ్ మలన్, క్రయాగ్ ఓవర్టన్, ఒల్లీ పోప్, ఓల్లీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
ఇదీ చదవండి:IND Vs ENG: కోహ్లీని ఎలా ఔట్ చేయాలంటే.!