ETV Bharat / sports

ఇద్దరు కెప్టెన్ల సంస్కృతిపై ధోనీ ఏమన్నాడంటే! - దినేశ్​ కార్తిక్​ ఇద్దురు కెప్టెన్ల ఫార్ములా

Dhoni on Two captains Teamindia: వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటంపై ధోనీ తనతో ఏమన్నాడో గుర్తుచేసుకున్నాడు సీనియర్​ క్రికెటర్​, వ్యాఖ్యాత దినేశ్​కార్తిక్​. భారత క్రికెట్​లో ఇద్దరు సారథులు ఉండటం అనేది కష్టమైన విషయమని మహీ చెప్పినట్లు పేర్కొన్నాడు.

dhoni on two captains teamindia
ధోనీ ఇద్దరు కెప్టెన్లు
author img

By

Published : Feb 2, 2022, 2:18 PM IST

Dhoni on Two captains Teamindia: టీమ్​ఇండియా టెస్టు కెప్టెన్​ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న ఆసక్తి కొద్ది రోజులుగా అభిమానుల్లో నెలకొంది. వన్డే సారథిగా ఎంపికైన రోహిత్​కే టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తారా లేదా వేరే ఆటగాడిని ఎంచుకుంటారా అనేది సందిగ్ధంగా మారింది. ఈ క్రమంలో దీనిపై స్పందించిన సీనియర్​ క్రికెటర్​, వ్యాఖ్యాత దినేశ్​కార్తిక్.. ఇద్దరు కెప్టెన్ల ఫార్ములాపై ధోనీ గతంలో తనతో ఏమన్నాడో గుర్తుచేసుకున్నాడు. ​

"భారత క్రికెట్​లో ఇద్దరు కెప్టెన్లు ఉండటం చాలా కష్టమైన విషయం అని ధోనీ నాతో క్లారిటీగా అనడం నాకు గుర్తుంది" అని దినేశ్​ కార్తిక్​ పేర్కొన్నాడు.

ప్రస్తుత భారత జట్టులో ధోనిలా యువ ఆటగాళ్లను ప్రోత్సహించే ఆటగాళ్లు లేకపోవడం వల్ల.. యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌లాంటి స్పిన్నర్లు విఫలమవుతున్నారని ఇటీవలే దినేశ్‌ కార్తిక్‌ అన్నాడు. మైదానంలో మహీ ఇచ్చే సలహాలు యువ ఆటగాళ్లకు చాలా ప్రయోజనకరమని చెప్పాడు.

అది నేను మాట్లాడటం సరికాదు:

dinesh karthik kohli captaincy: దక్షిణాప్రికాపై టెస్టు సిరీస్​ ఓడిపోయిన తర్వాత కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అతని వ్యక్తిగత విషయమని చెప్పాడు దినేశ్​. దానిపై తాను మాట్లాడటం సరికాదని వెల్లడించాడు. విరాట్​ అలా చేయడానికి కచ్చితంగా ఏమైనా బలమైన కారణం ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు.

"ఈ విషయం గురించి నేను మాట్లాడటం సరికాదు. ఏమైనా బలమైన కారణం వల్లే విరాట్​ ఇలా చేసి ఉండొచ్చు. కెప్టెన్​గా అతడు టీమ్​ఇండియాను అద్భుతంగా నడిపించాడు. టెస్టు జట్టును బలంగా తీర్చిదిద్దాడు. అతడి సారథ్యంలో నేను ఆడాను. ప్రతి మ్యాచ్​లోనూ జట్టు కోసం అతడు ఎంతో కష్టపడతాడో నాకు తెలుసు. ఓ వ్యక్తిగా, జట్టులోని సభ్యుడిగా ఈ విషయాన్ని చెబుతున్నా. విరాట్​ కెప్టెన్​గా ఎన్నో విజయాలు సాధించాడు. అందులో నేను భాగస్వామ్యం అవ్వడం నాకెంతో సంతోషంగా ఉంది. టెస్టు క్రికెట్​లో టీమ్​ఇండియాకు కెప్టెన్​గా వ్యవహరించిన గొప్ప ప్లేయర్లలో అతడు ఒకడు. అతడు వెనక్కి తిరిగి చూసుకుంటే తన కెరీర్​లో ఎన్నో మధుర జ్ఞాపకాలు కనిపిస్తాయి" అని దినేశ్​ వెల్లడించాడు.

ఇదీ చూడండి:

కెరీర్​పై సానియా మీర్జా కీలక నిర్ణయం!

Under-19 Worldcup Semifinal: నేడే ఆసీస్‌తో భారత్‌ సమరం

24 ఏళ్ల తర్వాత కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో క్రికెట్‌.. తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే?

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.