త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ కోసం దిల్లీ క్యాపిటల్స్ జట్టు కొత్త జెర్సీనీ విడుదల చేసింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ఆదివారం ఓ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. దిల్లీ క్యాపిటల్స్ పోస్ట్ చేసిన ఆ ఫొటోలో డెవిడ్ వార్నర్, అక్షర్ పటేల్‌తో పాటు పృథ్వీ షా కొత్త జెర్సీలను ధరించారు. కొత్త జెర్సీని చూసిన ఉత్సాహం.. కొత్త దిల్లీకి.. ఇదే కొత్త జెర్సీ.. అంటూ ఆ ముగ్గురిని ట్యాగ్ చేసింది.
మార్చి 31న మొదలవ్వనున్న ప్రతిష్ఠాత్మక ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. మరోవైపు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 1న జరగనున్న రెండో రోజు మ్యాచ్ కోసం దిల్లీ క్యాపిటల్స్ సిద్ధం కానుంది. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో దిల్లీ జట్టు పోటీ పడనుంది.
ఇక దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏప్రిల్ 4న దిల్లీ తమ మొదటి హోమ్ గేమ్‌ను ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో పోటీ పడనుంది. గత సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ మొత్తం 14 మ్యాచులాడి ఏడింట్లో గెలిచి.. ఏడింట్లో ఓడింది. 14 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ప్లే ఆఫ్ స్పాట్‌ను కోల్పోయారు.
-
𝕄𝕆𝕆𝔻 after looking at our #IPL2023 threads 👉 😁😍🥰💙❤#YehHaiNayiDilli ki Nayi Jersey 🥳 @davidwarner31 @akshar2026 @PrithviShaw pic.twitter.com/ofoLlwrJm0
— Delhi Capitals (@DelhiCapitals) March 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝕄𝕆𝕆𝔻 after looking at our #IPL2023 threads 👉 😁😍🥰💙❤#YehHaiNayiDilli ki Nayi Jersey 🥳 @davidwarner31 @akshar2026 @PrithviShaw pic.twitter.com/ofoLlwrJm0
— Delhi Capitals (@DelhiCapitals) March 19, 2023𝕄𝕆𝕆𝔻 after looking at our #IPL2023 threads 👉 😁😍🥰💙❤#YehHaiNayiDilli ki Nayi Jersey 🥳 @davidwarner31 @akshar2026 @PrithviShaw pic.twitter.com/ofoLlwrJm0
— Delhi Capitals (@DelhiCapitals) March 19, 2023
దిల్లీ క్యాపిటల్స్ జట్టు బలం: 25 మంది ఆటగాళ్లు (ఓవర్సీస్ 8)
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: ఇషాంత్ శర్మ (రూ.50 లక్షలు), ఫిల్ సాల్ట్ (రూ. 2 కోట్లు), ముఖేష్ కుమార్ (రూ.5.5 కోట్లు), మనీష్ పాండే (రూ.2.4 కోట్లు), రిలీ రోసోవ్ (రూ.4.60 కోట్లు).
మిగతా ఆటగాళ్లు - రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, లుంగీ ఎన్‌గిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్.
పోటీకి సై అంటున్న జడ్డూ.. హార్దిక్
స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఐపీఎల్ సీజన్ కోసం ఓ కొత్త ప్రోమోను రిలీజ్ చేసింది. మార్చి 31న చెన్నై, గుజరాత్ మధ్య జరగనున్న మ్యాచ్ కోసం ఈ తాజా ప్రోమోను రిలీజ్ చేసింది. అందులో హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాల మధ్య ఓ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
-
☝️taraf hai @hardikpandya7 ke champions, doosri taraf @imjadeja ke 4x winners. Dono ne ki hai taiyyari!
— Star Sports (@StarSportsIndia) March 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch #TATAIPL2023 ka opening match - Gujarat Titans vs Chennai Super Kings, 31st March LIVE on the Star Sports Network#IPLonStar #ShorOn #GameOn #BetterTogether pic.twitter.com/DflZnriWYS
">☝️taraf hai @hardikpandya7 ke champions, doosri taraf @imjadeja ke 4x winners. Dono ne ki hai taiyyari!
— Star Sports (@StarSportsIndia) March 19, 2023
Watch #TATAIPL2023 ka opening match - Gujarat Titans vs Chennai Super Kings, 31st March LIVE on the Star Sports Network#IPLonStar #ShorOn #GameOn #BetterTogether pic.twitter.com/DflZnriWYS☝️taraf hai @hardikpandya7 ke champions, doosri taraf @imjadeja ke 4x winners. Dono ne ki hai taiyyari!
— Star Sports (@StarSportsIndia) March 19, 2023
Watch #TATAIPL2023 ka opening match - Gujarat Titans vs Chennai Super Kings, 31st March LIVE on the Star Sports Network#IPLonStar #ShorOn #GameOn #BetterTogether pic.twitter.com/DflZnriWYS