కరోనా కారణంగా క్రికెటర్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్లు టిక్‌టాక్ వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
తాజాగా పీటర్సన్ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తన మెడను శరీరం నుంచి వేరు చేసిన విధంగా.. తల మెట్ల మీద నుంచి జారిపోతుందనే అభిప్రాయాన్ని ఆ వీడియో కలిగిస్తుంది. మిగిలిన శరీరమంతా స్థిరంగా ఉంది. "లాక్డౌన్లో ఎవరైనా తమ తలను పోగొట్టుకున్నారా?" అని ట్యాగ్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
థ్యాంక్స్ కరోనా
కరోనా కారణంగా ఒకర్ని ఒకరు శుభాకాంక్షలు తెలిపే పద్దతి మారిందని దానికి కారణమైన మహమ్మారికి కృతజ్ఞతలు చెప్పాలని అభిప్రాయపడ్డాడు పీటర్సన్. గతంలో ఉన్న కరచాలనం నుంచి బుగ్గ మీద చుంబనం వంటి పనులకు ప్రజలు స్వస్తి పలికారని తెలిపాడు.
లాక్డౌన్లో పలు లైవ్ సెషన్లలో పాల్గొంటూ క్రికెటర్లతో మమేకమయ్యాడు కెవిన్ పీటర్సన్. ఇటీవలే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ఆటతీరుతో పోలిస్తే స్మిత్ అతని దరిదాపుల్లోకి రాడని వ్యాఖ్యనించాడు.
ఇదీ చూడండి.. సైక్లింగ్ ట్రయల్స్ కోసం జ్యోతి కుమారికి పిలుపు