ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో కోహ్లీ తర్వాత అత్యంత వేగంగా రెండు వేల పరుగులు మైలురాయి అందుకున్న రెండో క్రికెటర్‌గా ఘనత సాధించాడు. సౌంథాప్టన్లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 ఈ ఘనత సాధించడం సహా మ్యాచ్ గెలవడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచులో 46 పరుగులు చేయగా.. అందులో ఏడు ఫోర్లు, ఓ సిక్స్ ఉంది.
మొత్తంగా అంతర్జాతీయ టీ20ల్లో 2 వేల పరుగులు చేసిన పదో బ్యాట్స్‌మన్ ఫించ్. అంతకముందు కోహ్లీ, రోహిత్ శర్మ, ఇయాన్ మోర్గాన్, డేవిడ్ వార్నర్ సహా పలువురు ఈ జాబితాలో ఉన్నారు.
తొలి టీ20 ఇంగ్లాండ్ 2 పరుగుల తేడాతో గెలిచింది. 163 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా విజయానికి చివరి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమవగా.. స్టాయినిస్ భారీ సిక్స్ బాదాడు. దాంతో ఉత్కంఠ నెలకొనగా.. బౌలింగ్ చేసిన టామ్ కరన్ ఆఖరి ఓవర్లో 12 పరుగులు ఇచ్చి ఇంగ్లాండ్‌ను గెలిపించాడు. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యాన్ని సంపాదించింది.
ఇదీ చూడండి ఐపీఎల్ ప్రాక్టీసులో కోహ్లీ అద్భుత క్యాచ్!