ETV Bharat / sports

తొలి కెప్టెన్​గా బెన్​ స్టోక్స్​ రేర్ రికార్డ్​! - england won on ireland

Ben stokes Ireland test : ఇంగ్లాండ్​ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆ వివరాలు..

England vs Ireland Test Match
తొలి కెప్టెన్​గా బెన్​ స్టోక్స్​ రేర్ రికార్డ్​!
author img

By

Published : Jun 4, 2023, 11:52 AM IST

Ben stokes Ireland test : ఇంగ్లాండ్​ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ చేయకుండా మ్యాచ్ గెలిచిన ఫస్ట్​ కెప్టెన్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌తో(England vs Ireland test match) జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచులో విజయం సాధించడంతో స్టోక్స్ ఈ ఫీట్ అందుకున్నాడు. శనివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఇంగ్లాండ్​ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయానికి కావలసిన పరుగులను కేవలం నాలుగు బంతుల్లోనే సాధించింది.

Ben stokes ashes 2023 : యాషెస్ సిరీస్​ కోసం.. మోకాలి గాయంతో ఇబ్బంది పడిన బెస్​ స్టోక్స్​.. చాలా రోజులుగా బౌలింగ్ చేయడం లేదు. ఇక ఈ మ్యాచ్​లోనూ ఫీల్డింగ్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ ఏమీ చేయలేదు. పూర్తి ఫిట్‌నెస్ సాధించినప్పటికీ.. రాబోయే యాషెస్ సిరీస్ కోసం ప్రస్తుత మ్యాచ్‌లో రిస్క్ తీసుకోలేదు. మిగతా ప్లేయర్స్​ కూడా ఈ మ్యాచ్‌ను.. వార్మప్​గా భావించి ఆడుతూ పాడుతూ గెలిచేశారు.

ఇక ఈ మ్యాచ్​లో ఫస్ట్ ఇన్నింగ్స్​లో ఐర్లాండ్​ 172 పరుగులు చేయగా.. ఓలిపోప్(208 బంతుల్లో 205; 22x4, 3x6) డబుల్ సెంచరీ బాదడంతో ఇంగ్లాండ్​ 524/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్​లో ఐర్లాండ్‌ 362 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్​ ముందు కేవలం 11 పరుగుల లక్ష్యం మాత్రమే నిలిచింది. దాన్ని ఓపెనర్‌ జాక్‌ క్రాలే ఫస్ట్​ ఓవర్‌ మొదటి, మూడు, నాలుగు బంతులను బౌండరీలు బాది విజయాన్ని ఖాయం చేశాడు. గత 13 మ్యాచ్‌లలో ఇంగ్లాడ్​కు ఇది 11వ విజయం కావడం విశేషం.

ఐపీఎల్​లోనూ ఆడకుండానే​..

Ben stokes injury ipl 2023 : ఈ ఐపీఎల్​ 16వ సీజన్​లో చెన్నై సూపర్ కింగ్స్​ టైటిల్​ విజేతగా నిలిచింది. ఫైనల్​లో గుజరాత్ టైటాన్స్​ను ఓడించింది. అయితే అసలీ సీజన్​​ కోసం అత్యంత ఎక్కువ ధర రూ.16.25కోట్లు పెట్టి మరీ స్టోక్ట్స్​ను కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్​. కానీ అతడు రెండు మ్యాచులు మాత్రమే ఆడాడు. టోర్నీ ప్రారంభంలోనే గాయం కారణంగా మిగతా మ్యాచుల నుంచి వైదొలిగాడు. కాగా, స్టోక్స్​.. న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ 2019, పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2022, 2019 యాషెస్ సిరీస్‌ మూడో టెస్టులో.. ఒంటిచేత్తో ఇంగ్లాండ్​ను విజయాల్ని అందించాడు. అందుకే సీఎస్కే అతడిని ఎక్కువ ధర పెట్టి మరీ కొనుగోలు చేసింది. కానీ అది వృథా అయిపోయింది.

ఇవీ చదవండి:

IPL 2023 : కాస్ట్లీ ప్లేయర్స్.. 10 మందిలో ఆడింది ముగ్గురే!

Team India New Jersey : డబ్ల్యూటీసీ ఫైనల్స్​కు న్యూ జెర్సీ.. ధర ఎంతంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.