ETV Bharat / sports

బీసీసీఐ అవార్డుల ఫంక్షన్​కు వేదిక రెడీ - ఆ స్టార్స్​ కూడా వస్తున్నారు!

BCCI Annual Awards : దాదాపు మూడేళ్ల తర్వాత బీసీసీఐ వార్షిక అవార్డుల ఫంక్షన్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఈ వేడుకకు హైదరాబాద్‌ను వేదికగా ఎంపిక చేసింది. ఆ వివరాలు మీ కోసం

BCCI Annual Awards
BCCI Annual Awards
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 1:08 PM IST

Updated : Jan 10, 2024, 1:31 PM IST

BCCI Annual Awards : కొవిడ్​ కారణంగా తాత్కాలికంగా ఆగిపోయిన బీసీసీఐ వార్షిక అవార్డుల ఫంక్షన్​, దాదాపు మూడేళ్ల తర్వాత మరోసారి గ్రాండ్​గా జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వేదికగా జనవరి 23న ఈ వేడుకను నిర్వహించేలా ఏర్పాట్లు మొదలుపెట్టారు. అట్టహాసంగా జరగనున్న ఈ వేడుకకు టీమ్ఇండియాతో పాటు ఇంగ్లాండ్ జట్టు ప్లేయర్లు హాజరుకానున్నారు. అయితే జనవరి 25 నుంచి ఉప్పల్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జరగనుంది. అవార్డుల వేడుక సమయానికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు హైదరాబాద్‌లోనే ఉండటం వల్ల వారిని కూడా వేడుకకు ఆహ్వానించనున్నారు.

తాజాగా బీసీసీఐ వార్షిక అవార్డుల ఫంక్షన్​ గురించి బోర్డు సెక్రటరీ జైషా అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఓ లేఖ రాశారు. ''ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం దేశంలోని అత్యుత్తమ క్రికెటర్ల సక్సెస్​ స్టోరీలను గుర్తించి వారిని గౌరవించే ఓ వేదిక. బీసీసీఐ వార్షిక అవార్డులకు మా గుండెల్లో ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.అవి అద్భుతమైన క్రికెట్ పట్ల శ్రేష్ఠత, అంకితభావం, అభిరుచికి ప్రతీకలుగా నిలుస్తాయి. క్రికెట్ హీరోలను అందించడంలోనూ మీరు చేసిన సహకారానికి ఎంతో ధన్యవాదాలు'' అంటూ జైషా పేర్కొన్నాడు.

ఇక ముంబయి వేదికగా 2020 జనవరిలో చివరిసారిగా బీసీసీఐ అవార్డుల ఫంక్షన్ జరిగింది. అందులో 2018-19 క్రికెట్ ఏడాదికి గానూ అత్యుత్తమ ప్లేయర్లకు అవార్డులను అందజేసింది.పురుషుల జట్టులో జస్ప్రీత్ బుమ్రా, ఉమెన్స్ జట్టులో పూనమ్ యాదవ్ 2020లో పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకున్నారు. మరోవైపు మాజీ క్రికెటర్ సీకే నాయుడు పేరిట ఉన్న లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కృష్ణమాచారి శ్రీకాంత్, అంజుమ్ చోప్రాకు అందించారు.

Ind Vs Afg T20 Series : మరోవైపు ఇంగ్లాండ్​తో జరగనున్న టెస్ట్ సిరీస్ కంటే ముందు భారత్ స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్​ కోసం బరిలోకి దిగనుంది. పంజాబ్​లోని మొహాలి వేదికగా గురువారం ఈ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక చాలా కాలం తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది.

అఫ్గాన్​ జట్టుకు ఊరట - ఆ ముగ్గురిపై బ్యాన్​ ఎత్తివేత

'వాళ్లకు స్పిన్‌ పిచ్‌ల అవసరం లేదు - అలా చేస్తే బలాన్ని తగ్గించినట్లవుతుంది'

Last Updated : Jan 10, 2024, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.