ETV Bharat / sports

ఏడోసారి ప్రపంచకప్​ నెగ్గిన ఆసీస్​.. ఫైనల్లో ఇంగ్లాండ్​ చిత్తు

AUSW vs ENGW: australia women won worldcup

author img

By

Published : Apr 3, 2022, 1:30 PM IST

Updated : Apr 3, 2022, 2:30 PM IST

13:25 April 03

ఏడోసారి ప్రపంచకప్​ నెగ్గిన ఆసీస్​.. ఫైనల్లో ఇంగ్లాండ్​ చిత్తు

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్​కప్​ ఫైనల్లో ఆసీస్​ గెలిచింది. ఇంగ్లాండ్​ను 71 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి.. రికార్డుస్థాయిలో ఏడోసారి ట్రోఫీని ముద్దాడింది. మొత్తం 12 ప్రపంచకప్పుల్లో ఆసీస్​ 7 సార్లు గెలవగా.. ఇంగ్లాండ్​ 4, న్యూజిలాండ్​ ఓసారి విజేతలుగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్​ చేసిన ఆసీస్​.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 356 పరుగులు చేసి ఇంగ్లాండ్​ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సెమీఫైనల్లో సెంచరీ చేసిన ఓపెనర్​ అలీసా హేలీ.. ఈ మ్యాచ్​లో మరింత రెచ్చిపోయింది. కేవలం 138 బంతుల్లోనే 170 పరుగులు చేసి ఆఖర్లో వెనుదిరిగింది. ఇందులో ఏకంగా 26 ఫోర్లు ఉండటం విశేషం. మహిళల ప్రపంచకప్​ ఫైనల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్​గా నిలిచింది హేలీ. అంతకుముందు 2005లో ఆసీస్​కే చెందిన రోల్టన్​ శతకం చేసింది. ​

రాచెన్​ హేన్స్​(68), బెత్​ మూనీ(62) పరుగులు చేశారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో ష్రబ్సోల్​ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్​ ప్రారంభించిన ఇంగ్లాండ్​.. ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. స్కివర్​ మాత్రమే సెంచరీతో రాణించింది. 148 పరుగులతో నాటౌట్​గా నిలిచింది. ఆమెకు సహకారం అందించే వారెవరూ లేకపోయారు. మరెవరూ కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయారు. ఆసీస్​ బౌలర్లలో అలెనా కింగ్​, జొనాస్సెన్​ తలో 3 వికెట్లు తీయగా.. మేగన్​ స్కట్ 2 వికెట్లతో రాణించింది.

ప్రపంచ రికార్డు: ఓ ఐసీసీ వరల్డ్​కప్​ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా ప్రపంచ రికార్డు సృష్టించింది హేలీ. పురుషుల క్రికెట్లోనూ ఈ రికార్డు సాధ్యం కాలేదు. ఆసీస్​ విధ్వంసకర ఓపెనర్​, మాజీ ప్లేయర్​ ఆడం గిల్​క్రిస్ట్​ 2007 పురుషుల క్రికెట్​ వరల్​కప్​ ఫైనల్లో చేసిన 149 పరుగులే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉంది. ఇప్పుడు చిరస్మరణీయ ఇన్నింగ్స్​ ఆడిన హేలీ.. దాన్ని బ్రేక్​ చేసింది. మహిళల వరల్డ్​కప్​ ఎడిషన్​లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కూడా హేలీ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ప్రపంచకప్​లో 9 ఇన్నింగ్స్​ల్లో 56.56 సగటుతో 509 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. దీంతో ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నమెంట్​గా నిలిచింది.

ఇదీ చూడండి: హేలీ ప్రపంచ రికార్డు.. గిల్​క్రిస్ట్​ రికార్డు బద్దలు

Last Updated : Apr 3, 2022, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.