ETV Bharat / sports

Asia Cup 2023 Ind vs Pak Reserve Day Weather : రిజర్వ్ డే రోజూ అదే పరిస్థితి! మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్? - కొలంబో వాతావరణం అప్​డేట్స్

Asia Cup 2023 Ind vs Pak Reserve Day Weather : 2023 ఆసియా కప్ సూపర్ 4 భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రిజర్వ్ డే కు వాయిదా పడింది. మరి సోమవారం కొలంబో వాతావరణం ఎలా ఉందంటే.

asia cup 2023 ind vs pak  reserve day weather

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 7:20 AM IST

Updated : Sep 11, 2023, 10:37 AM IST

Asia Cup 2023 Ind vs Pak Reserve Day Weather : 2023 ఆసియా కప్​లో భారత్-పాకిస్థాన్​ మ్యాచ్​కు వరుణుడు.. అంతరాయం కలిగిస్తూనే ఉన్నాడు. ఇరుజట్ల మధ్య లీగ్​ మ్యాచ్​ను తన ఖాతాలో వేసుకున్న వరుణుడు.. సూపర్ 4 మ్యాచ్​కు సైతం అడ్డంకిగా మారాడు. ఆదివారం కొలంబో పి. ప్రేమదాస స్టేడియంలో జరిగిన దాయాదుల సమరంలో 24.1 ఓవర్ల వద్ద వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. దీంతో ఆట సోమవారం రిజర్వ్ డేకు వాయిదా పడింది.

అయితే సోమవారం కూడా కొలంబోలో దాదాపు అదే పరిస్థితి ఉండనున్నట్లు తెలుస్తోంది. రిజర్వ్​ డే రోజున కూడా మ్యాచ్​కు వర్షం ముప్పు పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యలో వర్షం కురిసే అవకాశం 80 శాతం ఉన్నట్లు సమాచారం.

నేడు ( సోమవారం ) కూడా వర్షం అంతరాయం కలిగిస్తే.. ఓవర్లు కుదించి మ్యాచ్​ను నిర్వహించే అవకాశాల్ని పరిశీలిస్తారు. లేదా డక్​వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితం తేలే ఛాన్స్ ఉంది. ఇక ఈ రెండింటికీ అవకాశం లేకపోతే ​మరోసారి మ్యాచ్ రద్దవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.

Colombo Weather Update : ఉదయం నుంచి కొలంబోలో సూర్యుడు కనిపించలేదు. 7 గంటల సమయంలో భారీ వర్షం కొలంబోను ముంచెత్తింది. ప్రస్తుతానికి వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఆకాశంలో దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో మళ్లీ కచ్చితంగా వర్షం కురిసే ఛాన్స్​ ఉన్నట్లు సమాచారం. ఉదయం 30 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత..సాయంత్రానికి 25 డిగ్రీలకు పడిపోయి, వాతావరణంలో తేమ 90 శాతం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నాయి.

ఆదివారం ఆట నిలిచిపోయేసరికి భారత్ స్కోర్..

  • 147/2 (24.1 ఓవర్లు)
  • విరాట్ కోహ్లీ (8*)
  • కేఎల్ రాహుల్ (17*)
  • రోహిత్ శర్మ (56), శుభ్​మన్ గిల్ (58)..
  • షహీన్ అఫ్రిదీ 1/37
  • షాదాబ్ ఖాన్ 1/45
    • Another sad good night from Colombo as its still raining lightly here. Chances of rain during India vs Pakistan game are

      3PM - 80%
      4PM - 85%
      5PM - 80%
      6PM - 84%
      7PM - 87%
      8PM - 87%
      9PM - 88%
      10PM - 86%

      But the weather here is very unpredictable! #INDvsPAK #AsiaCup2023 #colombo pic.twitter.com/hSJSOvxo19

      — Ahmad Haseeb (@iamAhmadhaseeb) September 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Asia Cup 2023 Ind vs Pak : వర్షం ఎఫెక్ట్‌.. రిజర్వ్‌ డేకు టీమ్​ఇండియా - పాక్‌ మ్యాచ్‌

Asia Cup 2023 Ind vs Pak : సచిన్​-కోహ్లీ రికార్డులను సమం చేసిన రోహిత్​-కేఎల్​ రాహుల్​

Last Updated : Sep 11, 2023, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.