ETV Bharat / sports

Ashes series eng vs aus fifth test 2023 : బ్రాడ్‌ అదరహో.. రసవత్తరంగా సిరీస్​​ ఆఖరి రోజు.. ఇంగ్లాండ్​దే విజయం - stuart broad ashes 2023 wickets

England vs Australia Fifth Test : ఇంగ్లాండ్‌ - ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీగా సాగిన యాషెస్​ సిరీస్​ 2023 సీజన్​ గొప్పగా ముగిసింది. ఐదో టెస్టులో ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. కానీ విజయం చివరికి ఇంగ్లాండ్​కే వరించింది. మ్యాచ్ వివరాలు..

stuart broad ashes 2023
Ashes series eng vs aus fifth test 2023
author img

By

Published : Aug 1, 2023, 6:58 AM IST

England vs Australia Fifth Test : ఇంగ్లాండ్‌ - ఆస్ట్రేలియా మధ్య రసవత్తరంగా సాగిన యాషెస్​ సిరీస్​కు గొప్ప ముగింపు దక్కింది. ఐదో టెస్ట్​ ఆఖరి రోజు ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డాయి. ఓ వైపు వర్షం దోబూచులాట... మరోవైపు ఊరిస్తున్న విజయం.. అభిమానుల ఉత్కంఠ నడుమ హోరాహోరీగా మ్యాచ్​ సాగింది. చివరికి ఇంగ్లాండ్​ను విజయం వరించింది. ఆఖరి టెస్టులో 49 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని సిరీస్‌ను 2-2తో సమం చేసింది ఇంగ్లాండ్​. అయితే గత యాషెస్ సిరీస్​లో ఆస్ట్రేలియాను విజయం వరించడం వల్ల ట్రోఫీ ఆ జట్టు దగ్గరే కొనసాగుతుంది.

England won ashes 2023 5th test : ఐదో టెస్టులో 384 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. నాలుగో రోజు 135/0తో పటిష్టంగా నిలిచింది. దీంతో విజయం ఆ జట్టునే వరిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆసీస్​ బ్యాటర్లను.. ఆఖరి రోజు ఇంగ్లాండ్​ బౌలర్లు గట్టిగానే కట్టడి చేశారు. వారు అద్భుత ప్రదర్శన చేసి తమ టీమ్​ను గెలిపించిన తీరు ఎంతో గొప్పగా ఉంది. ఆట ప్రారంభమైన కాసేపటికే.. వార్నర్‌ (60), ఖవాజా (72)లను ఔట్‌ చేశాడు వోక్స్‌ (4/50). అలా చివరి రోజు ఆటలో ఇంగ్లాండ్​ మంచి ఆరంభం దక్కింది. ఆ తర్వాత క్రీజోలోకి వచ్చిన లబుషేన్‌ (11) ఎక్కువసేపు ఉండలేకపోయాడు. దీంతో ఆసీస్‌ 169/3 స్కోరుకు చేరుకుంది. అయితే ఈ దశలో స్టీవ్‌ స్మిత్‌ (54), ట్రావిస్‌ హెడ్​ (43) మంచి రాణించి ఇన్నింగ్స్​ను చక్కదిద్దారు. దీంతో ఆసీస్ పంచుకుంది.

stuart broad ashes 2023 : 238/3తో గెలుపు వైపు సాగుతున్న సమయంలో.. వర్షం ఆటంకం కలిగించింది. దీంతో దాదాపు రెండు గంటలకు పైగా ఆట నిలిచిపోయింది. అనంతరం ఆట ప్రారంభమయ్యాక.. మళ్లీ ఆసీస్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆ సమయంలో హెడ్‌ను మొయిన్‌ అలీ.. స్మిత్‌ను వోక్స్‌ ఔట్‌ చేసి వారి దూకుడుకు కళ్లెం వేశారు. ఇక అక్కడి నుంచి కథ యూటర్న్​ తీసుకుంది. వరుసగా వికెట్ల పతనం కొనసాగింది. 35 ఓవర్ల ఆట మిగిలిఉండగానే.. ఆసీస్‌ 294/8తో ఆలౌట్​ దశకు దగ్గరికి చేరింది. అప్పుడు కేరీ (28), మర్ఫీ (18) పోరాడేందుకు ప్రయత్నించారు. మళ్లీ ఆసీస్​లో ఆశలు చిగురించాయి. కానీ అది ఎక్కువ సేపు నిలువలేదు. ఈ మ్యాచ్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన బ్రాడ్‌.. బౌలింగ్ బరిలో దిగి మర్ఫీ, కేరీలను ఔట్‌ చేశారు. ఇంగ్లాండ్​కు గొప్ప విజయాన్ని అందించి కెరీర్​ను గొప్పగా ముగించాడు. దీంతో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలారు. కాగా, ఈ మ్యాచ్​ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 283, ఆస్ట్రేలియా 295 పరుగులు సాధించాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 395 పరుగులు చేసి ఆలౌట్​ అయింది.

ఇదీ చూడండి :

Ashes series Eng vs Aus 5th test 2023 : వార్నర్​ హైలైట్ రికార్డ్​.. ఐదో టెస్టులో కీలక మలుపు

Stuart Broad On Yuvraj Singh : యువరాజ్​ వల్లే సక్సెస్​ అయ్యా.. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను : బ్రాడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.