Ananya Pandey On Rohit Sharma : బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే - ఆదర్ష్ గౌరవ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన చిత్రం 'కో గయే హమ్ కహా'. ఈ సినిమా డిసెంబర్ 26 న ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే జియో సినిమా స్టూడియోస్‌లో భారత్ - ఆస్ట్రేలియా 5వ టీ20 ప్రీ మ్యాచ్ షోకు హాజరైంది హీరోయిన్ అనన్య.
ఈ షోలో వ్యాఖ్యాత క్రికెటర్ గురించి అడిగిన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది అనన్య. ' ఏ క్రికెటర్‌కు నువ్వు డీఎమ్ ( డైరెక్ట్ మెసేజ్) చేయాలనుకుంటున్నావ్'? అని యాంకర్ అడిగాడు. దీనికి సమాధానంగా 'నేను రోహిత్ శర్మకు మేసేజ్ చేయాలనుకుంటున్నా. అతడు నిజంగా అద్భుతమైన కెప్టెన్. వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ టీమ్ఇండియాను నడిపిన తీరు అద్భుతం. అతడికి థాంక్స్ చెప్పాలనుకుంటున్నా' అని అనన్య అంది. అలాగే టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని సైతం ఈ బ్యూటీ ప్రశంసించింది. 'విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్. గేమ్ పట్ల విరాట్ నిబద్ధతతో ఉంటాడు. మ్యాచ్ సమయంలో అతడు తన సతీమణి అనుష్క శర్మతో మాట్లాడే విధానం బాగుటుంది' అని చెప్పింది.
-
Captain Rohit Sharma💙
— SkyFair (@SkyFairsports) December 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Bollywood actress Ananya Pandey shared her thoughts on Rohit Sharma's leadership!#AnanyaPandey #RohitSharma #TeamIndia #Australia #T20I #ODI #Bollywood #Actress #Liger #dreamgirl #DreamGirl2Movie #SkyFair pic.twitter.com/l5jq5MrjnB
">Captain Rohit Sharma💙
— SkyFair (@SkyFairsports) December 4, 2023
Bollywood actress Ananya Pandey shared her thoughts on Rohit Sharma's leadership!#AnanyaPandey #RohitSharma #TeamIndia #Australia #T20I #ODI #Bollywood #Actress #Liger #dreamgirl #DreamGirl2Movie #SkyFair pic.twitter.com/l5jq5MrjnBCaptain Rohit Sharma💙
— SkyFair (@SkyFairsports) December 4, 2023
Bollywood actress Ananya Pandey shared her thoughts on Rohit Sharma's leadership!#AnanyaPandey #RohitSharma #TeamIndia #Australia #T20I #ODI #Bollywood #Actress #Liger #dreamgirl #DreamGirl2Movie #SkyFair pic.twitter.com/l5jq5MrjnB
Kho Gaye Hum Kahan Cast : 'కో గయే హమ్ కహా' చిత్రాన్ని అర్జున్ వారియర్ సింగ్.. రొమాంటిక్ డ్రామాగా తెరెక్కించారు. రచయితలు జోయా అక్తర్, రీమా కగ్టీ ఈ సినిమాకు కథ అందించారు. అనన్య, ఆదర్ష్తో పాటు నటుడు సిద్ధాంత్ చతుర్వేది సినిమాలో కీలక పాత్ర పోషించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆదివారం జరిగిన 5వ టీ20లో టీమ్ఇండియా, ఆసీస్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 154-8 కే పరిమితమైంది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (53) హాఫ్ సెంచరీ బాదగా, అక్షర్ పటేల్ (31 పరుగులు, 1 వికెట్ ) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించాడు.
ఆదిత్యతో అనన్య మూవీడేట్!- లవ్ కహానీపై 'లైగర్' బ్యూటీ క్లారిటీ!