ETV Bharat / sports

Ajit Agarkar About Virat Kohli : పాక్​ బౌలర్స్​ వర్సెస్​ కోహ్లీ... అగార్కర్ కాంట్రవర్సీ కామెంట్స్​లో నిజమెంత? - కోహ్లీపై అజిత్ అగార్కర్​ కామెంట్స్​

Ajit Agarkar About Virat Kohli : ఆసియా కప్​ కోసం టీమ్ఇండియా జట్టు ప్రకటన తర్వాత పాక్ బౌలర్ల గురించి చీఫ్ సెలెక్టర్ అగార్కర్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఇందులో అసలు నిజం లేదని తెలిసింది. ఆ వివరాలు..

Ajit Agarkar About Virat Kohli
Ajit Agarkar About Virat Kohli
author img

By

Published : Aug 21, 2023, 8:58 PM IST

Updated : Aug 28, 2023, 12:00 PM IST

Ajit Agarkar About Virat Kohli : ఆసియా కప్​ 2023 కోసం టీమ్ఇండియా జట్టును ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. టీమ్ అనౌన్స్​మెంట్ అనంతరం జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ప్రెస్​మీట్​లో పాల్గొని.. మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈ క్రమంలోనే "పాకిస్థాన్​తో మ్యాచ్​లో వారి బౌలర్లు హరీస్ రౌఫ్, షహీన్​ను ఎదుర్కోడానికి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా" అని ఓ విలేకరి అడగగా.. అగార్కర్ "వారి సంగతి విరాట్ చూసుకుంటాడులే" అని అగార్కర్​ నవ్వుతూ సమాధానమిచ్చినట్లు సోషల్​మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. విరాట్ ఫ్యాన్స్ అయితే.. అగార్కర్​ కరెక్ట్​గా చెప్పారంటూ ఈ వీడియోను తెగ వైరల్​ చేశారు.

పాక్​ బౌలర్ రియాక్షన్​... అగార్కర్​ అన్న వ్యాఖ్యలపై పాక్​ బౌలర్​ షాదాబ్ ఖాన్ కూడా స్పందించాడు. ఎవరైనా ఏదైనా అంటారని, కానీ క్రికెటర్లు తమ సత్తా ఏంటో స్టేడియంలో నిరూపించుకోవాలంటూ కాస్త అసహనంతో మాట్లాడాడు. సెప్టెంబరు 2న అసలు వాస్తవాన్ని చూస్తానని అన్నాడు. "మ్యాచ్​ రోజు ఏం జరుగుతుందనేది ముఖ్యం. దానిపైనే ఆధారపడి ఉంటుంది. నేనో లేదా ఇంకెవరైనా.. ఏమైనా అనొచ్చు. కానీ దాని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మ్యాచ్ జరిగినప్పుడే కదా అసలు ఏం జరుగుతుందో తెలిసేది" అంటూ ఛాలెంజ్ కూడా విసిరాడు. ప్రస్తుతం ఈ మాటలన్నీ చర్చనీయాంశమైంది.

ఇందులో నిజమెంత?.. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. అగార్కర్​ పాల్గొన్న ప్రెస్​మీట్​లో అతడు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది. అసలు అలాంటి ప్రశ్నే మీడియా ప్రతినిధులు వేయలేదని సమాచారం అందింది. ఇవన్నీ రూమర్స్​ అని తేలింది. సోషల్​మీడియాలో ఎవరో కావాలనే దీన్ని ప్రచారం చేశారని తెలిసింది.

India Squad For Asia Cup 2023 : ఇకపోతే స్టాండ్​బై ప్లేయర్ సంజూ శాంసన్​తో సహా.. 18 మందితో కూడిన జట్టులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు చోటుదక్కింది. ఇప్పటివరకూ వన్డేల్లో అరంగేట్రం చేయని తిలక్​కు నేరుగా ఆసియా కప్​ ఆడే అవకాశం రావడం అదృష్టమనే చెప్పాలి. ఇక ఆసియా కప్​లో తుది జట్టులో ఛాన్స్ లభిస్తే.. టీ20ల్లో సైతం రాణించాలని అతడి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా ఇటీవలె విండీస్​తో టీ20 సిరీస్​లో ఆడిన తిలక్ అదరగొట్టాడు. కానీ ప్రస్తుతం ఐర్లాండ్​ పర్యటనలో రెండు మ్యాచ్​ల్లో ఘోరంగా విఫలమయ్యాడు.

Ind vs Pak Asia Cup 2023 : ఆగస్టు 30 నుంచి ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ ఆరంభం కానుంది. పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఈ టోర్నీకి ఆతిథ్యమిన్ననున్నాయి. ఆరు దేశాలు టైటిల్ వేటలో ఉన్నాయి. ఇక నేపాల్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్​తో ఈ టోర్నీకి తెర లేవనుంది. సెప్టెంబర్ 2న భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో తలపడనుంది. కాగా సెప్టెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Ajit Agarkar Team Selection : 'అందుకే చాహల్​ను తప్పించాం.. ధావన్ మంచి ప్లేయరే కానీ'

ఆ రోజు నా తప్పేం లేదు.. కోహ్లీయే గొడవపడ్డాడు: నవీనుల్‌ హక్‌

Last Updated : Aug 28, 2023, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.