'ఆర్ఆర్ఆర్' థియేటర్లకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే చిత్రబృందంలోని పలువురు సభ్యులు.. ఇంటర్వ్యూల్లో పాల్గొని ఆసక్తికర విషయాలు చెబుతున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి.. రాజమౌళి సినిమాల గురించి ఓ క్రేజీ విషయం చెప్పారు.
"రాజమౌళి సినిమాలన్నింటిలో ఆయా విభాగాలు సినిమాను డామినేట్ చేసేవి. 'స్టూడెంట్ నం.1'లో సంగీతం, 'సింహాద్రి'లో స్టోరీ, 'సై'లో డైరెక్షన్ డామినేట్ చేశాయి. 'ఛత్రపతి' సినిమాకు మాత్రం అన్ని సరిసమానంగా కుదిరాయి. కానీ 'విక్రమార్కుడు' విషయంలో మాత్రం వీటికి భిన్నంగా జరిగింది. హీరో రవితేజ సినిమా మొత్తాన్ని డామినేట్ చేశారు" అని కీరవాణి చెప్పారు.
2006లో వచ్చిన 'విక్రమార్కుడు'.. పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్గా పోలీస్ కథతో తెరకెక్కింది. ఇందులో రవితేజ.. అత్తిలి సత్తిబాబు, విక్రమ్ సింగ్ రాఠోడ్ పాత్రల్లో అభిమానుల్ని తెగ ఆకట్టుకున్నారు. అప్పట్లో ఈ సినిమా టాలీవుడ్లో సెన్సేషనల్ హిట్గా నిలిచింది.
రాజమౌళి-కీరవాణి కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త సినిమా 'ఆర్ఆర్ఆర్'. రామ్చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గురువారం ట్రైలర్ను రిలీజ్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: