కరోనా, లాక్డౌన్ వల్ల థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకోని నేపథ్యంలో ఎన్నో బాలీవుడ్ సినిమాలు చిత్రీకరణలు పూర్తిచేసుకున్నా రిలీజ్‌కు నోచుకోలేకపోయాయి. ఆలస్యమైనా సినిమాహాళ్ల కోసం ఎదురూచూశాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు తిరిగి మాములు స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో బాలీవుడ్‌కు కీలకమైన మహారాష్ట్రలో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకునేందుకు వచ్చే నెల(అక్టోబర్ 22) నుంచి అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో పలువురు బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ డేట్లను ఖరారు చేసుకున్నాయి. ఈ ఒక్క రోజే దాదాపు పదికి పైగా చిత్రాల విడుదల తేదీలు వచ్చాయి. అవేంటంటే..
యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన చిత్రాలు
సైఫ్అలీఖాన్ 'బంటి ఔర్ బబ్లీ 2'- నవంబరు 19, 2021
అక్షయ్‌కుమార్ 'పృథ్వీరాజ్'- జనవరి 21, 2022
రణ్వీర్ సింగ్ 'జయేష్ భాయ్ జోర్దార్'- ఫిబ్రవరి 25, 2022
రణ్‌బీర్ కపూర్ 'షంషీరా'- మార్చి 18, 2022
నడియద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్(Nadiadwala Grandson ) తెరెకెక్కించిన చిత్రాలు
'తడప్'- డిసెంబరు 3,2021
రణ్వీర్ సింగ్ '83'- డిసెంబరు 25, 2021
అక్షయ్‌కుమార్ 'బచ్చన్ పాండే'- మార్చి 4,2022
టైగర్ ష్రాఫ్ 'హీరోపంతి 2'- మే 6, 2022
మిగతా ప్రొడక్షన్ హౌస్‌లు రూపొందించిన సినిమాలు
ఆమిర్ ఖాన్ 'లాల్‌సింగ్ చద్ధా'- ఫిబ్రవరి 14, 2022
షాహిద్‌కపూర్ 'జెర్సీ'- డిసెంబరు 31, 2021
కార్తిక్ఆర్యన్ 'భూల్ భులయ్యా 2'- మార్చి 25 2022
అజయ్ దేవగణ్ 'మేడే'- ఏప్రిల్ 29, 2022
ఇదీ చూడండి: రూ.400 కోట్ల డీల్‌కు స్టార్ ప్రొడ్యూసర్ నో- థియేటర్పైనే ఆశలు