ఇవి కూడా చదవండి:అభ్యర్థులు చేసే ఖర్చుపై నిఘా: ద్వివేది
లక్ష్మీపార్వతి పుస్తకం ఆధారంగానే లక్ష్మీస్ ఎన్టీఆర్! - rakeshreddy
రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మించిన రాకేశ్‌రెడ్డి... ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా సినిమా ఉందంటూ వచ్చిన ఫిర్యాదులపై ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చారు.
ఈసీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేశ్‌రెడ్డి
రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదంపై.. ఎన్నికల సంఘానికి సమాధానమిచ్చారు ఆ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా చిత్రాన్ని రూపొందించారని వచ్చిన ఫిర్యాదులపై.. ఈసీ ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చారు. దివంగతఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి రాసిన పుస్తకం ఆధారంగానే.. సినిమా తీశామని చెప్పారు. తమ సమాధానంపై ఈసీ సంతృప్తి చెందినట్టు రాకేష్ రెడ్డి తెలిపారు. ముందుగా అనుకున్న ప్రకారమే.. ఈ నెల 29న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అవుతుందని స్పష్టం చేశారు. విడుదల అనంతరం అభ్యంతరాలు వస్తే... మరోసారి విచారణకు హాజరు కావాలని ఈసీ అధికారాలు సూచించినట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి:అభ్యర్థులు చేసే ఖర్చుపై నిఘా: ద్వివేది