కోడి రామకృష్ణ ఆత్మకు శాంతి కలగాలి. మా ఇంట్లో ప్రతి శుభకార్యానికి హాజరై శుభాకాంక్షలు తెలిపేవారు. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన మొదటి సినిమా 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'లో నటించటం గర్వంగా ఉంది.
....మెగాస్టార్ చిరంజీవి
కోడి రామకృష్ణ గొప్ప మానవతావాది. ఎందరో దర్శకులకు, నటీనటులకు జీవితం ప్రసాదించారు.ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
.....అల్లరి నరేశ్.
అంకిత భావంతో పనిచేసే వ్యక్తిని కోల్పోవటం దురదృష్టకరం. వైవిధ్యమైన చిత్రాలతో సినీ పరిశ్రమలో తనదైనా ముద్ర వేశారు. శత్రువు సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. ఆయన లేని లోటు తీర్చలేనిది.
.....వెంకటేశ్
కోడి రామకృష్ణతో నాది 34 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణం. ఆయన లేరని చెప్పటానికి మాటలు రావటం లేదు. తలంబ్రాలు సినిమాముందు నుంచి మేము మంచి మిత్రులం.
..... శ్యాంప్రసాద్ రెడ్డి