ETV Bharat / sitara

మెడలో పాముతో శింబు.. కొరడాతో కార్తి - శింబు ఈశ్వరుడు సినిమా ఫస్ట్​లుక్

శింబు, కార్తి సినిమాల ఫస్ట్​లుక్స్ అలరిస్తూనే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇందులో మెడలో పాముతో శింబు, చేతిలో కొరడాతో కార్తి కనిపించారు.

karthi sultan, simbu eswarudu movie first looks
శింబు, కార్తి
author img

By

Published : Oct 26, 2020, 6:00 PM IST

కోలీవుడ్​ హీరోలు శింబు, కార్తిలు నటిస్తున్న కొత్త సినిమాల ఫస్ట్​లుక్స్ విడుదలయ్యాయి. విభిన్నంగా ఉంటూ అభిమానుల్ని అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా మెడలో పాముతో శింబు కనిపిస్తుండగా, చేతిలో కొరడా పట్టుకుని కార్తి దర్శనమిచ్చారు.

'సుల్తాన్​'గా కార్తి

కార్తి, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం 'సుల్తాన్'. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని, డబ్బింగ్ దశలో ఉంది. సోమవారం తొలిరూపును విడుదల చేశారు. ఇందులో కొరడా పట్టుకుని రౌద్రమైన లుక్​లో కార్తి కనిపిస్తున్నారు. భాగ్యరాజా కన్నన్ దర్శకుడు. త్వరలో తమ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నామని చిత్రబృందం తెలిపింది.

karthi sulthan cinema
సుల్తాన్ సినిమా ఫస్ట్​లుక్​లో కార్తి

'ఈశ్వరుడు'గా శింబు

శింబు నటిస్తున్న కొత్త సినిమా 'ఈశ్వరన్'. తెలుగులో 'ఈశ్వరుడు' పేరుతో తీసుకురానున్నారు. సోమవారం విడుదల చేసిన ఫస్ట్​లుక్​లో మెడలో నాగుపాముతో, పంటపొలాల మధ్యలో శింబు కనిపించారు. తమన్ సంగీతమందిస్తుండగా, 'నా పేరు శివ' ఫేమ్ సుశీంద్రన్ దర్శకుడు. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.

simbu eeshwarudu first look
ఈశ్వరుడు ఫస్ట్​లుక్​లో శింబు

ఇది చదవండి: ఇది దసరా కాదు.. టాలీవుడ్​ అప్​డేట్ల పండగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.