ETV Bharat / sitara

తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణ సర్కార్ వరాల జల్లు - తెలుగు సినీ పరిశ్రమపై కేసీఆర్ సర్కార్ వరాల జల్లు

తెలుగు సినీ పరిశ్రమపై కేసీఆర్ సర్కార్ వరాల జల్లు కురిపించింది. జీహెచ్​ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ మేనిఫెస్టోను వెల్లడించిన కేసీఆర్.. కరోనాతో స్తంభించిన చిత్రపరిశ్రమకు ఊతమిచ్చేలా పలు రాయితీలను ప్రకటించారు. 10 కోట్లలోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయంబర్స్‌మెంట్‌తోపాటు.. థియేటర్లకు కనీస విద్యుత్ ఛార్జీలను రద్దు చేస్తామని వెల్లడించారు. కేసీఆర్ ప్రకటనపై చిరంజీవితోపాటు చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది.

cm-kcr-tax-relaxes
cm-kcr-tax-relaxes
author img

By

Published : Nov 24, 2020, 9:03 AM IST

తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్ వరాల జల్లు

కరోనాతో కుదేలైన తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా తెరాస మేనిఫెస్టోను ప్రకటించిన కేసీఆర్.. పరిశ్రమకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి మేనిఫెస్టోలో టాలీవుడ్‌కు స్థానం కల్పించిన తెరాస.. హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. 10 కోట్లలోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. థియేటర్ల యాజమాన్యాల వినతులపై స్పందించిన కేసీఆర్‌.. థియేటర్లకు పలు రాయితీలను ప్రకటించారు.

సినిమా టికెట్ ధరలో సవరణలు చేసుకునేందుకు అనుమతి

రోజువారీ ప్రదర్శనల సంఖ్య పెంచుకునేందుకు వీలు కల్పించడంతోపాటు.. సినిమా టికెట్ ధరలో సవరణలు చేసుకునేందుకు అనుమతి ఇస్తామన్నారు. వ్యాపార సంస్థలతోపాటు థియేటర్లకు సంబంధించి కనీస విద్యుత్ ఛార్జీలను రద్దు చేయనున్నట్లు తెలిపారు. థియేటర్ల పునఃప్రారంభం విషయంలో సినీ పరిశ్రమకు పూర్తి అధికారం ఇస్తున్నామన్న కేసీఆర్.. కరోనాను దృష్టిలో పెట్టుకొని సినీ పెద్దలు వ్యూహాత్మకంగా ఆలోచించాలన్నారు. తెరాస ప్రకటించిన హామీల పట్ల సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. కరోనాతో చీకట్లు కమ్ముకున్న సినీ పరిశ్రమకు కేసీఆర్ ప్రకటన.. వెలుగులు నింపిందని నటుడు నాగార్జున అన్నారు.

కేసీఆర్ నేతృత్వంలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి

పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఈ ప్రకటన ఎంతో తోడ్పాటుగా ఉందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నేతృత్వంలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుందని చిరంజీవి విశ్వాసం వ్యక్తం చేశారు.

సినిమా హాళ్లకు ఇచ్చిన ప్రోత్సాహకాలకు థియేటర్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. అసోసియేషన్‌ సభ్యులతో మాట్లాడి.. త్వరలోనే హాల్స్‌ ప్రారంభిస్తామని... థియేటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి తెలిపారు. మరోవైపు ప్రభుత్వం సినిమా థియేటర్లు పునఃప్రారంభించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత 8 నెలలుగా మూతపడిన సినిమా హాల్స్ త్వరలో తెరుచుకోనున్నాయి.

ఇదీ చదవండి: ప్రతిపక్ష అభ్యర్థులకు భద్రత కల్పించండి: సీఈసీకి అచ్చెన్న లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.