ETV Bharat / sitara

అఖండ 'మాస్​ జాతర' కాదు.. అంతకుమించి.. ఇవే సాక్ష్యాలు! - బాలయ్య అభిమానుల సంబరాలు

Akhanda Fans Celebrations: థియేటర్లలో బాలకృష్ణ సినిమా రిలీజ్​ అవుతోందంటే అభిమానులకే కాదు సినిమా ప్రేమికులు అందరికీ ఎక్కడా లేని జోష్​ వస్తుంది. అలాంటిది మరి బాలయ్య-బోయపాటి కాంబినేషన్​లో ఓ మాస్​జాతర లాంటి సినిమా వస్తే వాళ్ల సంబరాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. మరి 'అఖండ​' విజయాన్ని అభిమానులు ఎలా సెలబ్రేట్​ చేసుకున్నారో.. థియేటర్లలో సందడి ఎలా ఉందో చూద్దాం.

Akhanda Fans Celebrations
'అఖండ'లో బాలకృష్ణ
author img

By

Published : Dec 2, 2021, 6:26 PM IST

Akhanda Fans Celebrations: జై బాలయ్య.. జైజై బాలయ్య.. 'అఖండ' రిలీజ్​ సందర్భంగా థియేటర్లు అన్నింటిలో మార్మోగిన నినాదమిది. బాలయ్య కటౌట్​కు కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టారు. వెండితెర మీద నటసింహాన్ని చూసిన అభిమానుల ఆనందానికి అంతులేదు. 'అఖండ'​ విజయాన్ని తమదైన శైలిలో సంబరాలు చేసుకున్నారు. ఇదంతా మన తెలుగు రాష్ట్రాలకే పరిమితమైందని అనుకుంటే పొరపాటే. ఒవర్​సీస్​లోని థియేటర్లలో కూడా 'అఖండ'ను చూసి ఫ్యాన్స్​ ఖుష్ అయ్యారు. జై బాలయ్య నినాదాలతో రచ్చ రచ్చ చేశారు.

హౌస్​ఫుల్​

బాలకృష్ణ-బోయపాటి శీను హిట్ ​కాంబినేషన్​కు పెట్టింది పేరు. సింహా, లెజెండ్​ వంటి బ్లాక్​బస్టర్ల తర్వాత వీరి కాంబోలో వచ్చిన చిత్రం అఖండ. అందులోనూ బాలయ్య నుంచి ఈ మాస్​ జాతరలాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది. మరి అలాంటి సమయంలో వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల సంబరాలు మామూలుగా ఉంటాయా? 'అఖండ'​ మోత, అభిమానుల కేరింతలతో థియేటర్లు దద్దరిల్లాయి. బుకింగ్​ కౌంటర్ల వద్ద హౌస్​ఫుల్​ బోర్డ్​లు దర్శనమిస్తున్నాయి. మాస్​, క్లాస్​ అని తేడా లేకుండా అన్ని సెంటర్లు ప్రేక్షకులతో కిక్కిరిశాయి.

Akhanda Fans Celebrations
కాలిఫోర్నియాలో బాలయ్య కటౌట్​కు కొబ్బరికాయలు కొట్టిన అభిమానులు

సింపుల్​గా బాలయ్య..

'అఖండ' విజయానికి అభిమానులు పూనకాలతో ఊగిపోతూ రకరకాలుగా సంబరాలు చేసుకుంటున్నారు. కానీ బాలయ్య మాత్రం ఈ వేడుకలను దూరంగా ఉన్నారు. గురువారం ఆయన హైదరాబాద్​లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఆక్సిజెన్​ జనరేటర్​ను ప్రారంభించారు. సినిమా టాక్​తో సంబంధం లేకుండా బాలయ్య తన పని తాను చేసుకుపోతున్నారంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రశంసిస్తున్నారు.

Akhanda Fans Celebrations
ఆక్సిజెన్​ జెనరేటర్​ను ప్రారంభించిన బాలయ్య
Akhanda Fans Celebrations
తల్లిదండ్రుల విగ్రహాలకు నమస్కరిస్తూ..

ఇదీ చూడండి : Akhanda review: బాలయ్య 'అఖండ' ట్విట్టర్​ రివ్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.