WhatsApp New Features : వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను మ్యూట్ (శబ్దం రాకుండా) చేసేందుకు మీకు అవకాశం కలుగుతుంది.
స్పామ్ కాల్స్‌కు చెక్
WhatsApp silence unknown callers : వాట్సాప్‌లో తెలియని నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయి. విదేశీ నెంబర్ల నుంచి, అలాగే ప్లస్ 188, 427, 22, 24, 31, 494 నంబర్లతో మొదలయ్యే వాట్సాప్ కాల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేరగాళ్లు మార్ఫింగ్ కాల్స్, స్పామ్ కాల్స్ చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. కొందరు వలపు వల విసురుతూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే, మరికొందరు వ్యక్తిగత డేటాను సేకరించి.. ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ మాతృసంస్థ మెటా ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ వ్యక్తిగత గోప్యతను కాపాడుతుంది. అలాగే వినియోగదారులకు మరింత నియంత్రణను ఇస్తుందని మెటా పేర్కొంది.
ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ఫోన్ల్లోనూ పనిచేస్తుంది. అయితే మీరు ఈ ఫీచర్‌ను స్వయంగా ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఎనేబుల్ చేసిన తరువాత మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని, తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ బయటకు వినిపించవు. ఈ ఫీచర్‌ను మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే కచ్చితంగా గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
-
WhatsApp announced silence unknown callers feature and privacy checkup!
— WABetaInfo (@WABetaInfo) June 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The ability to mute calls from unknown contacts and a privacy checkup feature are now available to everyone!https://t.co/bdbAXkVGOU pic.twitter.com/NtdTB8B9Aa
">WhatsApp announced silence unknown callers feature and privacy checkup!
— WABetaInfo (@WABetaInfo) June 20, 2023
The ability to mute calls from unknown contacts and a privacy checkup feature are now available to everyone!https://t.co/bdbAXkVGOU pic.twitter.com/NtdTB8B9AaWhatsApp announced silence unknown callers feature and privacy checkup!
— WABetaInfo (@WABetaInfo) June 20, 2023
The ability to mute calls from unknown contacts and a privacy checkup feature are now available to everyone!https://t.co/bdbAXkVGOU pic.twitter.com/NtdTB8B9Aa
మెటా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌లో తరచుగా న్యూఫీచర్స్ను అందుబాటులోకి తెస్తోంది. ఇటీవలే కొన్ని ఎంచుకున్న మార్కెట్లలో వాట్సాప్ ఛానల్స్ కూడా ప్రారంభించింది కూడా.
వాట్సాప్ - మల్టీ అకౌంట్ ఫీచర్
WhatsApp Multi Account Feature : ఒకే డివైజ్‌లో మల్టిపుల్ అకౌంట్స్ మధ్య సులభంగా మారడానికి (స్విచ్ కావడానికి) వీలుగా వాట్సాప్ ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది.
యూజర్లు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి బహుళ ఖాతాల మధ్య సులువుగా మారడానికి (స్విచ్ కావడానికి) ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సాప్ ఐఫోన్ కోసం ఈ ఫీచర్‌ను రూపొందించింది. దీని ద్వారా యూజర్లు ఒకే సారి నాలుగు డివైజ్‌ల్లో ఒకే నెంబర్‌తో ఖాతాలను కలిగి ఉండడానికి వీలు కల్పిస్తుంది.
డబ్ల్యూఏ బీటా ఇన్ఫో ప్రకారం, ఆండ్రాయిడ్ వాట్సాప్ బిజినెస్ ఖాతాల్లో ఇప్పటికే ఈ ఫీచర్‌ను పొందుపరిచారు. దీని ద్వారా వివిధ నెంబర్లతో ఉన్న వాట్సాప్ ఖాతాల మధ్య సులభంగా స్విచ్ కావడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. దీని వల్ల బిజినెస్ చేసేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మల్టిపుల్ వాట్సాప్ నెంబర్స్ కలిగిన యూజర్లు.. ఇకపై వాట్సాప్ క్లోనింగ్ చేయాల్సిన పని ఉండదు. అలాగే ఎక్కువ డివైజ్‌లు వాడాల్సిన పని కూడా ఉండదు.
-
Will Cathcart and Mark Zuckerberg confirm to WABetaInfo 3 features to come on @WhatsApp! 😱@wcathcart https://t.co/sDm41MpQiG
— WABetaInfo (@WABetaInfo) June 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
This is an amazing story. Disappearing mode, view once and multi device features are coming soon for beta users!
">Will Cathcart and Mark Zuckerberg confirm to WABetaInfo 3 features to come on @WhatsApp! 😱@wcathcart https://t.co/sDm41MpQiG
— WABetaInfo (@WABetaInfo) June 3, 2021
This is an amazing story. Disappearing mode, view once and multi device features are coming soon for beta users!Will Cathcart and Mark Zuckerberg confirm to WABetaInfo 3 features to come on @WhatsApp! 😱@wcathcart https://t.co/sDm41MpQiG
— WABetaInfo (@WABetaInfo) June 3, 2021
This is an amazing story. Disappearing mode, view once and multi device features are coming soon for beta users!
ప్రస్తుతానికి వాట్సాప్ బిజినెస్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలో వాట్సాప్ మెసెంజర్‌లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. అయితే నార్మల్, బీటా వెర్షన్స్‌లో దీనిని ఎప్పుడు అందుబాటులోకి తెస్తారో.. ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.