ETV Bharat / science-and-technology

వాట్సాప్​ యూజర్లకు బ్యాడ్​ న్యూస్​.. కీలక ఫీచర్‌ తొలగింపు - కొత్తగా వాట్సాప్​ తొలగించిన ఫీచర్స్​

ప్రైవసీ ఫీచర్ల అప్‌డేట్ తర్వాత యూజర్‌ గోప్యతకు అడ్డుగా ఉన్న ఫీచర్‌ను వాట్సాప్ వెబ్‌/డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో నిలిపివేసింది. మరోవైపు యూజర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కీలక ఫీచర్‌ బీటా వెర్షన్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వివరాలివే!

view-once-feature-for-desktop-users
వెబ్‌ వెర్షన్‌లో కీలక ఫీచర్‌ తొలగించిన వాట్సాప్
author img

By

Published : Nov 7, 2022, 8:05 AM IST

యూజర్ల వ్యక్తిగత గోప్యత కోసం ఇటీవలే వాట్సాప్‌ కొత్త ప్రైవసీ ఫీచర్లను పరిచయం చేసింది. ఇందులో భాగంగా వ్యూ వన్స్ ఫీచర్‌ ద్వారా పంపే ఫైల్స్‌ను యూజర్లు స్క్రీన్‌ షాట్‌ తీయలేరు. కానీ, డెస్క్‌టాప్ వెర్షన్‌లో మాత్రం ప్రింట్ స్క్రీన్‌ లేదా ఇతర టూల్స్‌ సాయంతో వ్యూవన్స్‌ ద్వారా సెండ్/రిసీవ్‌ చేసుకొన్న మెసేజ్‌లను స్క్రీన్‌ షాట్ తీసుకుంటున్నట్లు వాట్సాప్‌ గుర్తించింది. దీంతో డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో వ్యూ వన్స్ ఫీచర్‌ను తొలగించింది. ఇకపై డెస్క్‌టాప్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండదని తెలిపింది. దీంతో వ్యూవన్స్ ద్వారా పంపిన మెసేజ్‌లు డెస్క్‌టాప్‌/ వెబ్‌ వెర్షన్‌ వాట్సాప్‌లో కనిపించవు. మొబైల్ యాప్‌లో మాత్రమే వీటిని చూసే అవకాశం ఉంటుంది.

వాట్సాప్‌ ఎడిట్ మెసేజ్‌ ఫీచర్‌ను ఐఓఎస్ బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్‌ యూజర్లు వాట్సాప్‌ ఐఓఎస్ 22.23.0.73 వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకొని ఈ ఫీచర్‌ను పరీక్షించవచ్చు. ఎడిట్ మెసేజ్‌ ఫీచర్‌ కావాలంటూ చాలా కాలంగా యూజర్లు వాట్సాప్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. గత నెలలో మెసేజ్‌ ఎడిట్‌ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఎడిట్‌ చేసిన మెసేజ్‌ పక్కనే ఎడిటెడ్ అనే లేబుల్ కనిపిస్తుంది. మెసేజ్‌ ఎడిట్‌కు టైమ్‌ లిమిట్ కూడా ఉంటుందని సమాచారం.

కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌ పలు కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసింది. వీటిలో 32 మంది ఒకేసారి వాయిస్‌/వీడియో కాల్స్‌, 2 జీబీ ఫైల్ షేరింగ్‌, ఇన్‌-చాట్ పోల్‌తోపాటు గ్రూపులో 1024 మందిని సభ్యులుగా చేర్చుకునేందుకు వీలు కల్పించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.