ETV Bharat / science-and-technology

'మెటావర్స్'... జిందగీ మొత్తం ఇక వర్చువల్ దునియాలోనే! - మెటావర్స్​ గేమ్ కంపెనీలు

మీలో ఎవరైనా 'మెటావర్స్'(Metaverse Internet) పదం విన్నారా? 'లేదు' అన్నది మీ సమాధానమైతే.. త్వరలోనే దీని గురించి తప్పక వింటారు. ఎందుకంటే ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఇంటర్నెట్​కు మరో తరంగా ఇది అందుబాటులోకి రానుంది. ఫేస్​బుక్(Facebook Metaverse) ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున పని చేస్తోంది. ఇంతకీ ఏంటీ మెటావర్స్? అదెలా పనిచేస్తుంది?

What the metaverse is and how it will work
మెటావర్స్ అంటే ఏంటి?
author img

By

Published : Oct 25, 2021, 6:54 PM IST

మనిషి పనిని సులభతరం చేసేది సాంకేతికత. కొత్త ఆవిష్కరణలతో మానవుడు ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతలను రూపొందిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇంటర్నెట్, స్మార్ట్​ఫోన్, కంప్యూటర్ వంటి సాధనాలు.. ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి. ఇప్పుడు ఈ దిశగానే మరో ముందడుగు పడబోతోంది. తర్వాతి తరం ఇంటర్నెట్(Metaverse Internet) అందుబాటులోకి రానుంది. కొద్ది సంవత్సరాల్లో మనుషులు పూర్తిగా వర్చువల్ ప్రపంచంలోనే గడిపేలా సాంకేతికత రూపుదిద్దుకుంటోంది!

ఫేస్​బుక్ అధినేత మార్క్ జుకర్​బర్గ్.. ఈ తర్వాతి తరం సాంకేతికతపై(Facebook Metaverse) దృష్టిసారించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మెటావర్స్ కీలక పాత్ర పోషించనుందని భావిస్తున్నారు. ఫేస్​బుక్​ను ఓ సామాజిక మాధ్యమ సంస్థగా కంటే.. మెటావర్స్ కంపెనీగా ప్రజలు చూస్తారని చెబుతున్నారు. మాటల్లోనే కాదు.. చేతల్లోనూ ముందున్నారు మార్క్. ఇప్పటికే వేలాది మందిని ఈ పని కోసం నియమించుకున్నారు. ఐరోపాలో ఫేస్​బుక్ తరఫున ఈ ఇంజినీర్లంతా రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు.

ఫేస్​బుక్​ దారిలోనే అనేక వీడియో గేమ్ కంపెనీలు మెటావర్స్​పై(Metaverse Games) దృష్టిపెట్టాయి. ఆన్​లైన్​లో రాబోయే అతిపెద్ద మార్పు ఇదే కానుందని అంచనా వేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

ఫేస్​బుక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో మెటావర్స్ గురించి వివరించింది. దీంతో టెక్ నిపుణుల దృష్టి దీనిపై పడింది. ఇదే అంతర్జాల భవిష్యత్ కావొచ్చు. లేదంటే ఫేస్​బుక్​కు వచ్చిన బ్రహ్మాండమైన, వాస్తవ రూపం దాల్చని ఆలోచనగానే మిగిలిపోవచ్చు.

ఇంతకీ మెటావర్స్ అంటే ఏంటి?

ఇంటర్నెట్ రాకతో మనలో వచ్చిన మార్పులు ఒక్కసారి గుర్తు చేసుకోండి. అన్ని పనులూ ఆన్​లైన్​లోనే జరిగిపోతున్నాయి. భూగోళమంతా మన మునివేళ్ల మీదే ఉంటోంది. అయితే, మెటావర్స్ అనేది వీటన్నింటికీ మించి. ఇప్పటివరకు భౌతిక ప్రపంచంలోనే ఉండిపోయిన మనుషులను వర్చువల్ వరల్డ్​ను(Metaverse Virtual World) పరిచయం చేస్తుందీ మెటావర్స్. డిజిటల్ పరికరాల తెరలను చూడటానికే పరిమితమైన మనల్ని... అవధుల్లేని అంతర్జాల లోకంలో విహరించే వీలు కల్పిస్తుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అంతులేని ప్రపంచం. దూరంగా ఉన్నవాళ్లు ఒకరినొకరు వర్చువల్​గానే కలుసుకోవచ్చు. ఆడుకోవడం, మాట్లాడుకోవడం, పని చేసుకోవడం.. ఇలా అన్ని పనులూ వర్చువల్​గా, రియల్​టైమ్​లో ఒకరినొకరు చూస్తూ చేసుకోవచ్చు. వర్చువల్ రియాలిటీ హెడ్​సెట్​లు, అగ్​మెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు, స్మార్ట్​ఫోన్ యాప్​లు, ఇతర పరికరాల సాయంతో ఈ మెటాఫోర్​ను అభివృద్ధి చేయనున్నారు.

ఈ పనులే కాదు.. వర్చువల్ షాపింగ్​లూ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలు కూడా మెటాఫోర్ విధానంలోనే అందుబాటులోకి రానున్నట్లు అధునాతన సాంకేతికతలపై పనిచేసే విశ్లేషకులు విక్టోరియా పెట్రాక్ పేర్కొన్నారు. 'ఇది తర్వాతి తరం కనెక్టివిటీ. ఈ నిరంతర విశ్వంలో ఇక్కడ ప్రతీదీ ఒకే చోట లభిస్తుంది. భౌతిక జీవితాన్ని గడిపినట్లే.. వర్చువల్​గా మీ జీవితాన్ని గడుపుతారు' అని వివరించారు.

అయితే, ఈ సాంకేతికత ఇంతవరకు అందుబాటులోకి రాలేదు కాబట్టి వీటి గురించి ఇప్పుడే ఓ నిర్ధరణకు రాలేమని మరో గార్ట్​నర్ రీసర్చ్ సంస్థ విశ్లేషకుడు ట్యూనాగ్ ఎంగుయెన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మెటావర్స్​ సాంకేతికతకు సంబంధించిన ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి 10-15 సంవత్సరాలు పడుతుందని ఫేస్​బుక్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

మెటావర్స్ అన్న పదాన్ని మొదటిసారి నీల్ స్టీఫెన్​సన్ అనే రచయిత ఉపయోగించారు. 1992లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవల 'స్నో క్రాష్'లో దీని గురించి ప్రస్తావించారు.

మెటావర్స్​లో మనం ఏం పనులు చేయొచ్చు?

మెటావర్స్​లో వర్చువల్ కాన్సర్ట్​లు, ఆన్​లైన్ పర్యటనలు చేపట్టవచ్చు. అంతర్జాలంలోనే దుస్తులు ధరించి మనకు సరిపోయే సైజులను గుర్తించవచ్చు. వర్క్​ ఫ్రం హోమ్​ విషయంలో విప్లవాత్మకంగా నిలవనుందీ మెటావర్స్. వీడియో కాల్స్​లోనే సహోద్యోగులతో చూడటానికి బదులుగా.. వర్చువల్​ వాతావరణంలో కలిసి పనిచేసుకోవచ్చు.

ఫేస్​బుక్ ఇప్పటికే కంపెనీల కోసం హొరైజాన్ వర్క్​రూం సాఫ్ట్​వేర్లను అభివృద్ధి చేసింది. ఈ సంస్థే తయారు చేసిన 'ఆక్యులస్ వీఆర్' హెడ్​సెట్లను ధరించి ఈ వర్క్​రూంలలో పని చేసుకోవచ్చు. అయితే దీనిపై వచ్చిన రివ్యూలు మాత్రం ఆశాజనకంగా లేవు. ఒక్కో హెడ్​సెట్ ఖరీదే 300 డాలర్లు (రూ.22 వేలకు పైగా) ఉంటోంది. దీంతో ఈ అత్యాధునిక పరిజ్ఞానం చాలా కంపెనీల తాహతకు మించినదేనని అర్థమవుతోంది.

ఈ ఆన్​లైన్ ప్లాట్​ఫాంపై ఏ విధంగా కనెక్ట్ అవ్వాలనే అంశంపై సంస్థలు ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఈ సాంకేతికత కోసం నిర్దిష్ట నియమనిబంధనలను రూపొందించాల్సి ఉంది. ఇంటర్నెట్ మాదిరిగా.. ఏ కంపనీకి నియంత్రణ లేని వాతావరణాన్ని సృష్టించుకోవాలి. మెటావర్స్ అంటే ఒక్కటే అన్న భావన కలిగేలా చూడాల్సి ఉంది.

ఫేస్​బుక్ పూర్తిగా మెటావర్స్​లోకి మారుతోందా?

అవును. తర్వాతి తరం ఇంటర్నెట్​గా భావిస్తున్న ఈ సాంకేతికతపై జుకర్​బర్గ్(Facebook Metaverse) ఆసక్తి కనబరుస్తున్నారు. నిజానికి సంస్థ పేరును మార్చి.. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్ వంటి విభాగాలను మెటావర్స్​పై దృష్టిసారించే పేరెంట్ కంపెనీ కిందకు తీసుకురావాలని యోచిస్తున్నారు. దీనిపై ఈ వారం జరగనున్న ఫేస్​బుక్ వార్షిక వర్చువల్ రియాలిటీ కాన్ఫరెన్స్​లో జుకర్​బర్గ్ ప్రకటన చేయనున్నారని 'ది వర్జ్' అనే పత్రిక వెల్లడించింది. అయితే, దీనిపై ఫేస్​బుక్ ఎలాంటి కామెంట్ చేయలేదు.

అయితే, కొందరు విమర్శకులు మాత్రం ఈ వార్తలన్నింటినీ కొట్టిపారేస్తున్నారు. ఇటీవల కంపెనీ ఎదుర్కొన్న సంక్షోభాల నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకే ఈ వార్తలు సృష్టిస్తున్నారని చెబుతున్నారు. డేటా లీక్​లు, సంస్థపై అవిశ్వాస ఆరోపణలు, మాజీ ఉద్యోగుల సంచలన ప్రకటనలు చేసిన విషయాలను గుర్తు చేస్తున్నారు.

చిన్నారులపై ఫేస్​బుక్ హింసాత్మక ప్రభావం చూపుతోందని సంస్థ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హాగెన్ ఇటీవలే ఆరోపించారు. ఆన్​లైన్ సేఫ్టీ చట్టంపై చర్చిస్తున్న యూకే పార్లమెంట్ కమిటీ ముందు ఈ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పారు.

ఫేస్​బుక్ ఒక్కటేనా?

ఇవన్నీ సరే... మళ్లీ మెటావర్స్​ దగ్గరికి వద్దాం. ఫేస్​బుక్ కాకుండా.. చాలా సంస్థలు మెటావర్స్​పై(Metaverse Companies) పని చేస్తున్నాయి. అంతర్జాలం మాదిరిగానే ఒక్కరితో ఈ వ్యవస్థ రూపుదిద్దుకోదని జుకర్​బర్గ్ స్పష్టం చేశారు. ఏ కంపనీ సొంతంగా మెటావర్స్​ను సిద్ధం చేయలేదని చెప్పారు.

ఫేస్​బుక్ దీనిపై దృష్టిసారించినంత మాత్రాన.. ఆ సంస్థ గానీ, ఇతర దిగ్గజ సంస్థలు గానీ ఈ రంగంలో ఆధిపత్యం చెలాయించే అవకాశాలు లేవని నిపుణులు అంటున్నారు. అనేక స్టార్టప్​లు వీరికి పోటీకి రావొచ్చని విశ్లేషకుడు ఎంగుయెన్ పేర్కొన్నారు.

గేమింగ్ సంస్థలు, కన్సూమర్ బ్రాండ్లు...

'మెటావర్స్' ఆలోచన వీడియో గేమ్స్ కంపెనీలకు(Metaverse Games) వరం లాంటిది. ఇప్పటికే ఆన్​లైన్ గేమ్స్​కు విపరీతమైన ఆదరణ ఉంది. ఇక వర్చువల్​ ప్రపంచంలోకి అడుగుపెట్టి.. నెట్టింట ప్రత్యక్షంగా ఆడుకోవడమంటే.. గేమర్లకు సరికొత్త అనుభూతి అనే చెప్పాలి.

ఎపిక్ గేమ్స్ అనే సంస్థ ఈ సాంకేతికతపై వేగంగా పనిచేస్తోంది. దీర్ఘకాలిక లక్ష్యాల్లో భాగంగా మెటావర్స్​ను తీర్చిదిద్దేందుకు పెట్టుబడిదారుల నుంచి బిలియన్ డాలర్లను (రూ.ఏడున్నర వేల కోట్లు) సమీకరించింది. రోబ్లాక్స్ అనే మరో దిగ్గజ సంస్థ సైతం ఈ దిశగా అడుగులు వేస్తోంది. 3డీ ప్రపంచంలో నేర్చుకోవడం, ఆడుకోవడం, పని చేసుకోవడం, సామాజికంగా అనుసంధానమవ్వడం వంటి అంశాలపై దృష్టిసారిస్తోంది.

కన్సూమర్ బ్రాండ్లు సైతం ఇందులో వెనక్కి తగ్గేది లేదంటున్నాయి. ఇటాలియన్ ఫ్యాషన్ దిగ్గజం గూచీ.. జూన్​లో రోబ్లాక్స్​తో జట్టుకట్టింది. 'డిజిటల్ ఓన్లీ' యాక్సెసరీస్​ను విక్రయించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కోకాకోలా, క్లినిక్ సంస్థలు డిజిటల్ టోకెన్లను విక్రయిస్తున్నాయి. మెటావర్స్​కు ఇది తొలి అడుగు అని భావిస్తున్నారు.

వ్యక్తిగత గోప్యతే పెద్ద అవరోధం!

మెటావర్స్ వ్యవహారంలో ఫేస్​బుక్(Facebook Metaverse) పేరు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో నిపుణులు కీలక అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు. దిగ్గజ టెక్ సంస్థల చేతిలో ఇవి బందీ కాకూడదని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. మెటావర్స్​లో తమపై ఎవరూ నిఘా పెట్టకూడదని భావిస్తున్నట్లు క్రిప్టోకరెన్సీ సంస్థ 'కిండర్డ్ వెంచర్స్' మేనేజింగ్ భాగస్వామి స్టీవ్ జంగ్ పేర్కొన్నారు.

ఇప్పటికే.. యాడ్​ల కోసం వ్యక్తిగత డేటాను విక్రయిస్తోందన్న ఆరోపణలు ఫేస్​బుక్​పై ఉన్నాయి. సామాజిక మాధ్యమాల వ్యూహాలలో ప్రకటనలదే కీలక భాగమని, మెటావర్స్​లోనూ దీనికి సముచిత స్థానం ఉంటుందని స్వయంగా జుకర్​బర్గ్ తాజా ప్రకటనలో తెలిపారు. కాబట్టి ఇదే వ్యాపార సూత్రాన్ని మెటావర్స్​లో పాటిస్తుందని పలువురు భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఉన్న ముప్పుతో పాటు మనకు తెలియని గోప్యతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఎంగుయెన్ పేర్కొన్నారు.

మరోవైపు, ప్రస్తుత ప్లాట్​ఫాంలో ఉన్న సమస్యలనే ఫేస్​బుక్ పరిష్కరించలేదని పెట్రోక్ చెప్పుకొచ్చారు. అలాంటిది వర్చువల్​ వరల్డ్​లో కీలకంగా మారే మెటావర్స్​ ఏర్పాటులో ఈ సంస్థ ముందుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. మెటావర్స్​ కోసం మరింత వ్యక్తిగత డేటా ఇవ్వాల్సి ఉంటుందని, ఇది దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. 'అన్ని సమస్యలపై వారు విస్తృతంగా చర్చించారని నేను భావించడం లేదు. మెటావర్స్ వల్ల ఏర్పడే గోప్యతా సమస్యలపై వారు ఆలోచించడం లేదనేదే నా ఆందోళన' అని అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.