How to Lock Whatsapp Web on PC : తమ వినియోగదారులు వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచడమే లక్ష్యంగా ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ రోజుకో కొత్త ఫీచర్‌తో యూజర్స్ ముందుకు వస్తోంది. ఇప్పటికే వాట్సాప్‌కు చెందిన పలు కీలక అప్డేట్లు వినియోగదారులకు అందిబాటులోకి రాగా.. మరికొన్నింటిని బీటా టెస్టర్ల కోసం అందిస్తూనే అభివృద్ధి చేస్తోంది. మరి తాజాగా వచ్చిన సరికొత్త ఫీచర్లతో పాటు ఇప్పటికే యూజర్స్ వినియోగిస్తున్న ఆ నయా ఫీచర్లేంటో ఇప్పుడు చూద్దాం.
వాట్సాప్ వెబ్‌లో కొత్త స్క్రీన్ లాక్ ఫీచర్..
Whatsapp Latest Update Features : తాజాగా విడుదల చేసిన వాట్సాప్ వెబ్ న్యూ స్క్రీన్ లాక్ ఫీచర్( Can We Lock Whatsapp Web )తో వినియోగదారుల గోప్యతను మరింతగా రక్షించవచ్చని వాట్సాప్ తెలిపింది. ముఖ్యంగా డెస్క్‌టాప్‌లు లేదా ల్యాప్‌టాప్‌లలో వినియోగించే వాట్సాప్ వెబ్ వినియోగదారులకు ఈ నయా ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని వివరించింది. ఇది మన వాట్సాప్ అకౌంట్లోకి అనధికారిక యాక్సెస్‌ను నిలుపుదల చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను బీటా టెస్టర్లు మాత్రమే వినియోగించగలరు. త్వరలో దీనిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ అభివృద్ధి చేస్తోందని ప్రముఖ వైబ్‌సైట్ WABetaInfo వెల్లడించింది.
స్క్రీన్ లాక్ ఫీచర్ ఇలా పనిచేస్తుంది..
ఈ నయా ఫీచర్ మీ డివైజ్‌లో అందుబాటులోకి వచ్చిందా లేదా అని తెలియాలంటే ఈ కింది స్టెప్స్‌తో చెక్ చేసుకోండి.
- ముందుగా సెట్టింగ్స్>ప్రైవసీలోకి వెళ్లాలి.
- ఒకవేళ ఈ ఫీచర్ మీ అకౌంట్లో ఎనేబుల్ అయితే గనుక 'స్క్రీన్ లాక్' అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- అప్పుడు మీరు వాట్సాప్ వెబ్‌ను తెరవడానికి పాస్‌వర్డ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడైతేనే మీరు చాట్ లిస్ట్‌ను యాక్సెస్ చేయగలరు.
ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే..
Whatsapp New Lock Feature : మీరు ఒకవేళ పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే వాట్సాప్ వెబ్ నుంచి లాగ్ అవుట్ అవ్వాలి. అనంతరం QR కోడ్ స్కాన్ సాయంతో మళ్లీ లాగిన్ చేయాలి. దీనికితోడు మీ వాట్సాప్ వెబ్‌ను లాక్( How To Lock Whatsapp In PC )చేసినప్పుడు వచ్చే మెసేజ్‌లు నోటిఫికేషన్ల రూపంలో కనిపించవు. దీంతో అన్ఆథరైజ్డ్ యూజర్స్ మీ వ్యక్తిగత సందేశాలను చూడలేరు. అయితే వాట్సాప్ వెబ్ బీటా తాజా వెర్షన్‌ను ఉపయోగించే కొంతమంది వినియోగదారులకు ఈ స్క్రీన్ లాక్ ఫీచర్‌ను కల్పించింది ఆ సంస్థ. మరికొద్ది వారాల్లోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తేనుంది.
వాట్సాప్‌లో వీడియోకాల్ అప్‌గ్రేడ్..
Whatsapp Video Call Latest Update : వీడియోకాల్ సమయంలో మీరు ఎవరికైనా మీ స్క్రీన్‌ను షేర్ చేయాలనుకుంటే వాట్సాప్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్‌ను వినియోగించవచ్చు. ఈ నయా ఫీచర్( Whatsapp Latest Features )ను యాపిల్ ఫేస్‌టైమ్‌తో పోలి ఉంటుంది. ఈ ఫీచర్ సాయంతో మీరు వీడియో కాల్లో ఉన్న సమయంలోనే మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఏవైనా డాక్యుమెంట్లు, ఫొటోలు వంటి వాటిని సులంభంగా షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు షేర్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం మీరు పంపాల్సిన అప్లికేషన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి అదనంగా వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను కలిగి ఉన్న వినియోగదారులు ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో కూడా వీడియో కాల్‌ను ఆస్వాదించవచ్చు.
15 నిమిషాల ముందే 'షెడ్యూల్డ్ వాట్సాప్ వాయిస్ కాల్స్'..
Whatsapp Scheduled Voice Call : వాట్సాప్‌లో వాయిస్ కాల్‌లను షెడ్యూల్ చేసే విధంగా ఉండే సరికొత్త ఫీచర్‌ను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు మెటా అధినేత జుకర్ బర్గ్ పేర్కొన్నారు. ఇది కాల్‌ను స్వీకరించే వారికి 15 నిమిషాల ముందే వాయిస్ కాల్‌ను గుర్తు చేస్తూ ఓ అలర్ట్‌ను పంపిస్తుంది. కాగా, ఈ ఫీచర్ ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నట్లు మెటా తెలిపింది.