‘ఫైర్ ఫ్లై’... సోలార్ ఎల్‌ఈడీ ల్యాంప్ తయారీకీ పెట్టింది పేరు. దీనికి బ్యాటరీ ఏమీ అక్కర్లేదు. పగలు ఎండలో పెడితే రాత్రివేళ ఎనిమిది గంటలపాటు వెలుగునిస్తుంది. ఎండలేకపోతే ఎలా అన్న సందేహం అక్కర్లేదు... దీనికున్న కేబుల్ సాయంతో మామూలు కరెంటుతోనూ, కంప్యూటర్ ద్వారానూ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నా... మనం ఓ కాగితంలా మడిచి బ్యాగ్‌లో పెట్టుకోవచ్చన్నది దీని ప్రత్యేకత. పైగా... వానకి తడిసినా, నీటిలో మునిగినా ఏమీ కాదు. ఎంత వేగంతో కిందపడ్డా ఓ ప్లాస్టిక్ బంతిలా ఎగిరి ఊరుకుంటుందే తప్ప దీనికి ఏ రిపేరూ రాదు. ఈ బల్బ్‌ని సిలికాన్‌తో తయారుచేయడం ద్వారా... ఇదంతా సాధ్యం చేయగలిగామని చెబుతోంది ఫైర్ ఫ్లై సంస్థ.
ఇదీ చదవండి: మీరెళ్లొద్దు.. డస్ట్‌బిన్నే మీ దగ్గరకు వచ్చేస్తుంది!