WhatsApp Scams : ఇటీవల కాలంలో రకరకాల ప్రయత్నాలతో సైబర్ నేరగాళ్లు ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. తమ ఎత్తుగడలు ప్రదర్శించి అమాయకులతో పాటు చదువుకున్న వారినీ తమ వలలో దింపుతున్నారు. ఫోన్లకు వ్యక్తిగత మెసేజ్‌లు, లింక్‌లు, ఓటీపీలు పంపించి బ్యాంకు ఖాతాల్లోని నగదు మాయం చేస్తున్నారు. అంతేకాకుండా ఫోన్లు చేసి వర్క్ ఫ్రం హోం అంటూ జాబ్ ఆఫర్స్ ఇస్తామని మోసం చేస్తున్నారు.
అయితే.. ఇదంతా ఒకప్పటి ట్రెండ్. మారుతున్న కాలానికి అనుగుణంగా వీరూ తమ రూట్లను ఎంచుకుంటున్నారు. ప్రజలకు టోకరా వేసేందుకు తాజాగా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ఎంచుకున్నారు. ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి ఆడియో, వీడియో కాల్స్ చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి మోసాలపై వాట్సాప్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
How To Avoid Whatsapp Scams : సైబర్ మోసగాళ్లు.. వాట్సాప్‌ను ఎంచుకోవడానికి ఓ కారణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది వాడే ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లో ఇది మొదటిది. రెండు బిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లను ఇది కలిగి ఉంది. దీని మాతృసంస్థ అయిన మెటా.. ఎప్పటికప్పుడు తమ వినియోగదారుల భద్రత కోసం చాట్ లాక్, లాస్ట్ సీన్, స్టేటస్ హైడ్ చెయ్యడం లాంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అయినప్పటికీ కొందరు నేరగాళ్లు వాట్సాప్ వినియోగదారుల్ని మోసం చేయడానికి రకరకాల దారుల్ని ఎంచుకుంటున్నారు. అయితే మీరు ఈ టిప్స్ పాటించి ఉచ్చులో పడకుండా జాగ్రత్తపడండి.
తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు రియాక్ట్ అవ్వకండి
Whatsapp Scam Calls : అపరిచిత నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు రియాక్ట్ అవ్వకండి. ఎందుకంటే ఇటీవల కాలంలో వాట్సాప్ వినియోగదారులు తమకు ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. స్కామర్లు తాము సంపాదించిన డేటా బేస్‌తో రాండమ్‌గా పలు నంబర్లను ఎంచుకుని కాల్స్ చేస్తున్నారు. ఫేక్ జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం అవకాశం అంటూ ట్రాప్ చేయాలని చూస్తున్నారు. అయితే వినియోగదారులు గమనించాల్సిన అంశం ఏంటంటే.. జాబ్ అప్లై చేయడానికి ఏ కంపెనీ కూడా డబ్బులు అడగదు. ఒక వేళ అడిగితే.. అది ఫేక్ కంపెనీ అని గుర్తించండి. అలాంటి నంబర్లను బ్లాక్ చేయండి.
![WhatsApp Scams](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18537112_caklls.jpg)
ఆ మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకండి
Whatsapp Scams Messages : వర్క్ ఫ్రం హోమ్, పార్ట్ టైమ్ జాబ్ పేరుతో మీ వాట్సాప్‌కు వచ్చే మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకండి. రెగ్యులర్ జాబ్‌తో పోలిస్తే.. జీతం ఎక్కువ అని ఆశ చూపి వలలో వేసుకుంటారు. ఒకవేళ బిజినెస్ నంబర్ నుంచి సందేశం వస్తే.. దానికి అధికారిక అకౌంట్లకు ఉండే గ్రీన్ టిక్ ఉందో లేదో గమనించండి. ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి కాల్ వస్తే.. అది అనుమానాస్పదంగా అనిపిస్తే లిఫ్ట్ చేయకుండా రిపోర్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి బ్లాక్ చేయండి.
![WhatsApp Scams](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18537112_eeee.jpg)
ప్రైవసీ సెట్టింగ్స్ యాక్టివేట్ చేసుకోండి
Whatsapp Privacy Settings : సైబర్ మోసాల్ని చెక్ పెట్టాలంటే మొదటగా మీ ఖాతాలో సెక్యూరిటీ ఆప్షన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఒక వేళ లేకుంటే ఈ స్టెప్స్ ఫాలో అయి ఆన్ చేసుకోండి. ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోండి. అక్కడ Profile Photo, Last Seen, Status సెట్టింగ్స My Contacts or Nobody సెలెక్ట్ చేసుకోండి. ఒక వేళ అవి Everyoneలో ఉంటే మాత్రం అందరూ యాక్సెస్ చేసుకునే ప్రమాదముంది.
![WhatsApp Scams](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18537112_privacny.jpg)
అంతే కాకుండా ప్రైవసీ మెనూలోనే Groups ఆప్షన్ ఉంటుంది. మనల్ని ఎవరైనా గ్రూపులో యాడ్ చేసే అవకాశం ఇది కల్పిస్తుంది. దీన్ని Only My Contactsలో ఉంచండి. దీని వల్ల మీ ప్రమేయం లేకుండా ఇతరులు మిమ్మల్ని గ్రూపుల్లోకి యాడ్ చేయలేరు. దీంతో పాటు వాట్సాప్‌కు ఫింగర్ ప్రింట్ లేదా పిన్ ద్వారా లాక్ చేసుకోండి. ఫలితంగా మీ ఫోన్ వేరే వాళ్ల దగ్గర ఉన్నప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసే అవకాశముండదు.